Suryaa.co.in

Andhra Pradesh

‘ప్రతిభ’ పురస్కారానికి ‘ఈనాడు’ పూర్వ ప్రతినిధి వల్లీశ్వర్ ఎంపిక

తెలుగు విశ్వవిద్యాలయం 2021 సంవత్సరం ‘ప్రతిభ’ పురస్కారానికి పాత్రికేయ రంగంలో ‘ఈనాడు’ పూర్వ ప్రతినిధి జి. వల్లీశ్వర్ ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది.ఏటా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 12 మందిని తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాలతో సత్కరిస్తూంటుంది.

వల్లీశ్వర్ ‘ఈనాడు’ సంస్థలో ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం, న్యూఢిల్లీ, హైదరాబాద్ లలో దాదాపు 26 సంవత్సరాలు (1978-2004) రిపోర్టింగ్ లో పని చేశారు. చివరి ఎనిమిదేళ్ళు ఇదే సంస్థలో ‘న్యూస్ టైమ్’ బ్యూరో ఛీఫ్ గా ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో నౌకాదళం, షిప్ యార్డు, స్టీల్ ప్లాంట్, పోర్ట్ ట్రస్ట్ తదితర ప్రభుత్వరంగ సంస్థలపై పరిశోధనా వ్యాసాలతో పాత్రికేయుడిగా విశిష్ట ముద్ర వేశారు. 2005-15 కాలంలో ‘ఆంధ్ర ప్రదేశ్’ మాస పత్రిక ప్రధాన సంపాదకులుగా ఆ పత్రికను తీర్చిదిద్దారు.

LEAVE A RESPONSE