(చాకిరేవు)
ఊరంతా అక్క ఛైర్మన్ అవుతుందని కూడబలుక్కొని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారంతా చెప్పారని ఆశపడింది. ఆ విజయంతో రోజా గారి దగ్గరకు వెళ్లింది.
ఇంకేం.. నువ్వే కదా ఛైర్మన్ అని మరింత ఆశ పెట్టి వలవేసింది రోజా. తన చేతికి మట్టి అంటకుండా తెలివిగా.. పుత్తూరు ఇంచార్జీ అయిన తన సోదరుడు కుమారస్వామి రెడ్డిని కలవమంది రోజా.
ఆయన 40 లక్షలు అడిగే సరికి హతాశురాలు అయ్యింది. మాకు రిజర్వేషన్ వుంది కదా అన్నా.. అని ప్రాధేయపడినా కుమారస్వామి రెడ్డి కనికరించలేదు.
భంగపడి ఇంటికి వచ్చి బాధపడింది. తన ఆశను చంపుకోలేక రోజా సోదరుడిని ఇంటికి పిలిచి డబ్బు ఇచ్చింది.
40 లక్షల డబ్బిచ్చినా మోసం చేశారు. రెండేళ్లు ఆగమంటే చైర్మన్ ఆశతో ఎదురుచూసింది. గడువు అవుతూనే మరో 6 నెలలు అన్నారు. మళ్లీ ఆశతో ఎదురుచూసింది.
మళ్లీ మరో రెండేళ్లు ఆగమన్నారు. అనుమానం వచ్చి ఎన్నికలు అయ్యాక వద్దులే నా డబ్బు నాకు ఇచ్చేయండి అని అడిగింది. సమయం ఇవ్వమన్నారు. ఇప్పటికీ ఆమె డబ్బు ఇవ్వలేదు. రోజా గారికి మెసేజ్ చేసినా.. చూసి గమ్మున అయిపోయింది.
అలా 40 లక్షలు నగిరి నక్కపాలు చేసి మోసపోయాను అనే బాధను జీర్ణం చేసుకోలేక, ఆవేదనతో మీడియా ముందుకు వచ్చింది, నగరి జిత్తు నక్క బాధితురాలైన ఈవిడ.