– ఉచిత చేప పిల్లలను 50 శాతం మాత్రమే సరఫరా చేశారు
– కేసీఆర్ గంగపుత్రులను బలోపేతం చేయాలనీ ఈ పథకాన్ని ప్రారంబించారు
– ఎలాంటి కోతలు లేకుండా చేప పిల్లలను, రొయ్యలను సరఫరా చేయాలి
– SRSP ప్రాజెక్ట్ లో ఉచిత చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో పాల్గొని చేప పిల్లలను వదిలిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
బాల్కొండ : గంగ పుత్రులను బలోపేతం చేసి తద్వారా కుల వృతులపై ఆధారపడి జీవనము సాగించే వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఒక మంచి ఉద్దేశ్యంతో కేసీఆర్ గారు ఉచిత చేప పిల్లల పంపిణి పథకం తీసుకొచ్చారని కానీ రేవంత్ రెడ్డి అన్ని పథకాల్లో లాగానే ఈ పథకంలో కూడా కోతలు పెడుతున్నారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ…కేసీఆర్ గత పదేండ్లు మత్స్య కారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత చేప పిల్లలు మరియు రొయ్య పిల్లలను సరఫరా చేసారని అన్నారు.. గంగ పుత్రులకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తే వారు ఆర్థికంగా బలోపేతం అవుతారని కెసిఆర్ భావించేవారు కెసిఆర్ ప్రభుత్వంలో బాల్కొండ నియోజకవర్గంలో కోటి 74 లక్షల చేప పిల్లలు 68 లక్షల రొయ్య పిల్లలు సుమారు 3 కోట్ల 70 లక్షలతో గత 10 ఏండ్లలో 35 కోట్ల తో ఉచితంగా సరఫరా సరఫరా చేసాము ఉచిత చేప పిల్లలతో పాటు మత్స్యకారులకు 8 కోట్ల విలువగల మోపెడ్ టీవీఎస్ స్కూటీలు, వలలు,డీసీఎం, మొబైల్ ఫిష్ మార్కెట్ వాహనాలు ఇలా అనేక సౌకర్యాలు కల్పించాం.
72 లక్షలతో ఎనిమిది మత్స్య సహకార సంఘ భవనాలు 10 లక్షలతో బాల్కొండలో ఒక ఫిష్ మార్కెట్ సుమారు 19 మంది మత్స్యకార కుటుంబాలకు 77 లక్షల విలువగల ఇన్సూరెన్స్ చెక్కులను అందజేయడం జరిగింది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గత సంవత్సరం ఒక కోటి 74 లక్షల చేపు పిల్లలకు గాను 83 లక్షల మాత్రమే సరఫరా చేసింది.గత సంవత్సరం రొయ్య పిల్లలను అసలే పంపిణీ చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఒక్కటి కూడా ఈ రెండేండ్లలో మత్స్యకారులకు ఇవ్వలేదు.
ఈ సంవత్సరం ఒక కోటి 74 లక్షల చేప పిల్లలను పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. వీటితో పాటు గత సంవత్సరం తక్కువగా పంపిణీ చేసిన 89 లక్షల చేప పిల్లలను కలిపి ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు అలాగే గత సంవత్సరం ఇవ్వని 70 లక్షల రొయ్య పిల్లలను ఈ సంవత్సరం కలిపి మొత్తం కోటి 40 లక్షల రొయ్య పిల్లలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో FDO దామోదర్ మరియు ప్రవీణ్ రెడ్డి, వెంకటేష్, నర్సారెడ్డి, సామ వెంకట్ రెడ్డి,మండల నాయకులు కార్యకర్తలు, మత్స్య కారులు పాల్గొన్నారు