Suryaa.co.in

Andhra Pradesh

రాక్షసపాలనను అంతమొందిస్తేనే కడప జిల్లా వాసులకు స్వేచ్ఛ

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరిన కమలాపురం నేతలు
– చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేష్

వచ్చే ఎన్నికల్లో కమలాపురంలో గెలుపేలక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు పనిచేయాలని అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. రాక్షసపాలనను అంతమొందిస్తేనే కడపజిల్లా వాసులకు స్వేచ్ఛ కలుగుతుందని తెలిపారు. చెన్నముక్కపల్లి విడిది కేంద్రంలో కమలాపురం నియోజకవర్గం తప్పెట్ల గ్రామానికి చెందిన సర్పంచ్ గడికోట శాంతి, భర్త సుధాకర్ రెడ్డి, గండిరెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచులు.. గాలి ప్రసాద్ రెడ్డి, దర్శన్ రెడ్డి, మిట్టపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, గోనుమాకపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ శేఖర్ రెడ్డి, అంబవరం మాజీ ఎంపీటీసీ ముంతా జానయ్య, సీనియర్ నేతలు రామసుబ్బారెడ్డి, నాగేంద్ర రెడ్డి, దళిత నేతలు కొప్పుల జగన్, అనిల్, చంటితో పాటు పలువురు దళిత యువకులు సోమవారం లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పిన లోకేష్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ..సీఎం సొంత జిల్లాలోనే ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉందని, కడప జిల్లాలోనూ జగన్ పనైపోయిందని పేర్కొన్నారు. జగన్ ను నమ్ముకున్నవారే వైసీపీ నుండి బయటకు వస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జగన్ కు కడప జిల్లాలో ఎదురుగాలి వీచిందన్నారు.

పార్టీలో చేరిన పలు గ్రామాల వారు…
నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారూ లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.మిట్టపల్లికి చెందిన 20 కుటుంబాలు, గంగిరెడ్డిపల్లికి చెందిన 30 కుటుంబాలు, గోనుమాకులపల్లికి చెందిన 30 కుటుంబాలు, అలిదిన, పాయసంపల్లి, పడదుర్తి, చడిపిరాళ్లకు చెందిన ఎస్సీలు, ఎస్ఆర్ నగర్, జెబి నగర్ కాలనీ, ఉప్పర్పల్లికి చెందిన 40 కుటుంబాలు, తోలగంగనపల్లికి చెందిన 8 కుటుంబాల వారితో పాటు పలువురు టీడీపీలో చేరారు.

LEAVE A RESPONSE