- • వినతులతో తమ గొంతులను వినిపిస్తున్న బాధితులు
• సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా చర్యలు చేపడుతున్న నేతలు - • నేడు వినతలు స్వీకరించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనబాక లక్ష్మి
మంగళగిరి : అతి నికృష్ట నీచ పిశాచి పాలనలో మూగబోయిన బాధితుల గొంతులకు నేడు స్వేచ్ఛ కలిగింది. పెద్దిరెడ్డి నుండి వైసీపీ పిల్ల సైకోల వరకు కొనసాగించిన దందాలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలపై బాధితులు లబోదిబోమంటూ.. న్యాయం కోసం నేడు కూటమి నేతలు, అధికారుల వద్దకు క్యూ కడుతున్నారు.
అధికారం చేపట్టిన మొదటి రోజు నుండే ప్రజా సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. ప్రజల నుండి వినతుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది. అందుకోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ను పెట్టింది. అంతే కాకుండా.. ప్రతి శనివారం నేరుగా సీఎం చంద్రబాబు నాయుడే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను వింటున్నారు. మంత్రులు, నాయకులు ప్రతిరోజు ప్రజల నుండి వినతులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
ఈమేరకు మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో… రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పనబాక లక్ష్మి కేంద్ర కార్యాలయానికి వచ్చి అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు.
బూచోళ్ల భూదాహానికి… బకాసురుల అరాచకాలకు బలైన బాధితులు.. బటన్ నొక్కుడు మోసాలకు బలై అర్హులైనా లబ్ధి అందక నష్టపోయిన అభాగ్యులు. అధిక సంఖ్యలో తరలివచ్చి నేడు తమ వినతులను కేంద్ర కార్యాలయంలో అందించారు. గత పాలకుల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అర్హులమైనా తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఆవేదనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పనబాక లక్ష్మి వారికి భరోసా కల్పిస్తూ… గత పాలకుల పాపాలకు బలైన బాధితులకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరికి చట్టబద్దంగా న్యాయం జరిగేలా చూస్తామని అర్జీదారులకు వారు హామీ ఇచ్చారు.
• పేరేచర్ల తెల్లక్వారీ వర్కర్స్ లేబర్ కాంట్రాక్ట్ సహకార సంఘం వాళ్లు విజ్ఞప్తి చేస్తూ.. 2020లో క్వారీకి దరఖాస్తు చేసుకోని వంద కుటుంబాలు బతుకుతున్నాయని… దాన్ని పీవిఆర్ లాక్కున్నాడని.. దాంతో ఇళ్ల గడవకా.. పిల్లలను చదివించుకోలేక ఇబ్బంది పడుతున్నామని.. కావున తమ యందు దయఉంచి క్వారీ గ్రాంటును తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
• శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ, వేటగిరి కొత్తూరు గ్రామానికి చెందిన నాగరాజు భార్య శారద మాట్లాడుతూ… తమకు వారసత్వంగా వచ్చిన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ.. అక్రమార్కుల ఆక్రమణ నుండి తమ భూమిని విడిపించాలని కన్నీటి పర్యంతం అయ్యారు.
• మాచర్ల మండలానికి చెందిన బాణావత్ లక్ష్మానాయక్ టీడీపీ నేత కావడంతో తన పొలాన్ని వైసీపీ నేతలు లాక్కుని పొలంలోకి వెళితే చంపుతామని బెదిరిస్తున్నారని.. తన పేరు మీద ఉన్న పొలాన్ని నాటి ఎమ్మెల్యే పిన్నెల్లి సహకారంతో వైసీపీ నేతలు వారి పేరుమీదకు మార్చుకున్నారని. కావున దయవుంచి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.
• నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం మల్లవేముల, పెద్దబోదనం గ్రామానికి చెందిన అబ్బాయిగారి చిన్న ఓబులమ్మ, కుమారి, గాదె ఉపశనయ్య లు విజ్ఞప్తి చేస్తూ. తాము ఎస్సీలమని.. వైసీపీ నేతలు తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి జేసీబీతో 30 మీటర్ల లోతు వరకు మట్టిని తొవ్వి అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
• నాడు జోగి రమేష్ ఆదేశాలతో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని బుక్ కీపర్లను మార్చకుండా ఆపేశారని.. పెడన నియోజకవర్గంలో బుక్ కీపర్లు బహిరంగంగా 2024 లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారని.. వారిని మార్చాలని పోతన వెంకట లక్ష్మీ నరసింహస్వామి కోరు.
• చిలకలూరిపేట కు చెందిన కోటేశ్వరమ్మ విజ్ఞప్తి చేస్తూ… తాను బతికి ఉండగానే.. చనిపోయినట్లు నకిలీ డాక్యూమెంట్లు సృష్టించి తన ఆస్తిని కొట్టేశారని.. దయ ఉంచి ఈ అన్యాయానికి సహకరించిన అధికారులు, దోపిడీదారులను కఠినంగా శిక్షించి తన ఆస్తి తనకు దక్కేలా చేయాలని నేడు గ్రీవెన్స్ లో కోరారు.
• తాళ్లూరు మండలం సోమవరపాడు గ్రామానికి చెందిన పోలా సుజాత తనకు భర్త లేడని…తనను అక్రమంగా గంజాయి కేసులో ఇరికించి వేదిస్తున్నారని… తనను జైలుకు పంపి ఇబ్బంది పెట్టారని… తనకు ఇద్దరు పిల్లలు ఇన్నారని ఆరోగ్యం కూడా సరిగ్గాలేదని తనను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని… వారి నుండి తనను ఆదుకోవాలని లేదంటే చావే శరణ్యమని మంత్రి, మహిళానేతల ముందు కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను వివరించి పరిష్కరించాలని వారు ఆదేశించారు.
• గతంలో తమకు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మంచి మనసుతో పౌల్ట్రీ ఫారాలను బత్రుకుదెరువుకోసం ఇచ్చారని… వర్షాల కారణంగా అవి కుప్పకూలి నష్టపోయామని… వాటిపై అప్పులు కూడా పుట్టడంలేదని… వాటికి పక్కా రిజిష్ట్రేషన్ రికార్డులతో చిరస్థాయిగా తమకు ఉండేలా పాస్ పుస్తకాలు ఇప్పించాలని విశాఖ జిలా ఆనందపురం, లొడగలవానిపాలెం గ్రామ పంచాయతీ చెందిన వారు విజ్ఞప్తి చేశారు.
• ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్న దివ్యాంగుల పెన్షన్లు 1/08/2022న తొలగించారని.. దివ్యాంగులపైనే ఆధారపడి వారి కుటుంబ పోషణ నడుస్తున్న ఇళ్లు చాలా ఉన్నాయని.. వైసీపీ తొలగించిన పింఛన్లను వెంటనే అమలు చేయాలని టీడీపీ వివిధ ప్రతిభ వందతుల ప్రధాన కార్యదర్శి పెండెం గాంధీ కోరారు. దివ్యాంగులకు ప్రత్యేక చట్టం అమలు చేసి 40% నుండి 100% ఉన్న విజువల్ ఛాలెంజ్ డ్ మరియు చెవిటి వారికి ఆర్టీసీలో రాయితీ కల్పిచాలని కోరారు.
• తాను దివ్యాంగుడనని… తాను బీఏ చదువుకున్నా ఉద్యోగం రాలేదని… తాను బతికేందుకు శ్రీశైలం దేవస్థానంలో షాపు కేటాయించాలని నాగరాజారావు నేడు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశాడు.
• MGNREGS సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు అములు చేసిన 23% పీఆర్సీ ప్రకారం జీతాలు పెంపుదల మరియు ఉద్యోగ భద్రత కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ… అర్జీ ఇచ్చారు.
• కొల్లి గంగరాజు తన భార్య విజయవాడకు చెందిన ఏజెంట్ కుమారి ద్వారా దుబాయ్ వెళ్లిందని… తన భార్య వెళ్లి 5 నెలలు అయినా ఒక్క సారి కూడా మాట్లడలేదని. ఏం జరిగిందో ఏమోనని ఆందోళనగా ఉందని.. ఏజెంట్ ను అడిగితే డబ్బులు కట్టమని బెదిరిస్తుందని.. దయచేసి తన భార్యను దూబాయ్ నుండి వెనక్కి రప్పించాలని విజ్ఞప్తి శారు.
అంతే కాకుండా వైసీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులు, భూ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, దివ్యాంగ సమస్యలు, పింఛన్ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఫీజుల సమస్యలు, కారుణ్యనియామకాలు ఇలా అనేక సమస్యలతో వందలం మంది అర్జీ దారులు నేడు గ్రీవెన్స్ కు పోటెత్తారు.