– ప్రధాని మోదీ ప్రశంస
– అధికారులు, సిబ్బందికి మంత్రి నారాయణ అభినందనలు
అమరావతి: విజయవాడ లో నీటి సరఫరాను ప్రధాని మోదీ అభినందించడం గర్వకారణం.. నిన్నటి మన్ కీ బాత్ లో విజయవాడలో నీటి సరఫరాపై ప్రధాని ప్రశంస. విజయవాడలో నీటి నిర్వహణ చాలా బాగుందని వ్యాఖ్యానించిన ప్రధాని. ప్రధాని వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమని మంత్రి నారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేఖర్లతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పర్యవేక్షణ తో విజయవాడ ఇటీవలే స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు దక్కించుకుంది. విజయవాడ కార్పొరేషన్ లో ప్రతి రోజూ 16 లక్షల మందికి స్వచ్ఛమైన మంచినీరు అందిస్తున్నాం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండప్రాంతాల్లో సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తున్నాం. సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రానికి అమృత్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించింది. అమృత్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే మూడేళ్ళలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర, ఇతర అధికారులు, సిబ్బందికి నా అభినందనలు అని మంత్రి పేర్కొన్నారు.