-రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం
-కేరళ కాదు కేరళం
-ఆమోదం కోసం త్వరలో కేంద్రానికి
-ఆగస్టులో కూడా ఇదే తరహా తీర్మానం
కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలతో పాటు అందరూ ఏకపక్షంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. పేరు మార్పునకు చెందిన తీర్మానాన్ని ఆమోదం కోసం త్వరలో కేంద్రానికి పంపనున్నారు. గత ఏడాది ఆగస్టులో కూడా ఇదే తరహా తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తు చేసింది.