(చాకిరేవు)
ఆనాడు ఉత్తరాంధ్రాకి ఫోక్స్ వ్యాగన్ కారును తెస్తానని ఊరించి, ప్రజల్ని గాల్లో తిప్పిన మన బొత్సా సత్తిబాబు గారు.. ఇప్పుడు ‘మావిగన్’ అభివృద్ధే మా పార్టీ విధానం అని సరికొత్త వేదాంతం వినిపిస్తున్నారు. “సొమ్ములు పోనాయి ఏటి సేత్తాం?” అని ఈయన ఆనాడు పెట్టిన ఆ అమాయకపు ‘బుంగమూతి’ చూసి లోకం తరించింది!
పోయింది సత్తిబాబు గారి చెమట చుక్క కాదు, ఉత్తరాంధ్రా ప్రజల తలరాత, వారి చెమట చిందించి కట్టిన పన్నుల సొమ్ము అని జనం ఇంకా మర్చిపోలేదు. చేతలు గడప దాటకపోయినా, ఈయన మాటలు మాత్రం ఉత్తరాంధ్రా కోటలు దాటి ప్రపంచం మొత్తం వినబడుతున్నాయి!
ఇంటర్నేషనల్ డాన్ డిమిత్రీ ఫిర్టాష్ దగ్గర ‘బోయింగ్’ విమానాల పేరుతో నాడు గురువు గారు అక్షరాలా కోట్లు వసూలు చేస్తుంటే, దానికి ‘చీఫ్ ప్రచార కర్త’గా డప్పు కొట్టిన ఘనత మన సత్తిబాబుదే. అప్పట్లో మన బాక్సైట్తో బోయింగ్ విమానాలు ఎగురుతాయని ఆకాశం వైపు చూపించారు.. కట్ చేస్తే, అదే నాలుకతో నేల మీద ఉన్న అమరావతిని ‘శ్మశానం’ అని శాపనార్థాలు పెట్టారు.
చిత్రమేమిటంటే, వీరు శ్మశానం అన్న చోటే ఒక చిన్న ముక్కకు ‘మావిగన్’ అని పేరు పెట్టి, అదేదో ఎనిమిదో ప్రపంచ వింతలా కలరింగ్ ఇస్తున్నారు. నాడు ఆకాశంలో విమానం.. నేడు నేల మీద గన్.. మొత్తానికి ఈ ‘సున్నాగన్’ లతో ఉత్తరాంధ్రా జనానికి మిగిలింది మాత్రం బొత్సా గారు తొవ్విన ఒక పెద్ద రంధ్రం!
“కడప బ్యాచ్ వచ్చి భూములు కొట్టేస్తోంది.. బాబోయ్!” అంటూ ఎన్నికల ముందు ఈయన కార్చిన ముసలి కన్నీరు చూస్తే ..ఆస్కార్ అవార్డు కూడా చిన్నబోయి, సత్తిబాబు గారి కాళ్ల మీద పడాల్సిందే. మొత్తానికి మన ఉత్తరాంధ్రాకు బొత్సా కుటుంబం ఒక పెద్ద ‘బొక్క’ తప్ప చేసింది ఏమీ లేదని ప్రజలు పక్కనబెట్టారు. జగన్ విసిరిన ఎమ్మెల్సీ పదవి కోసం తన నాలుకతో సర్కస్ చేస్తున్నారు.
