– డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, డిసెంబరు 29 : అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ కార్యకలాపాల నిర్వహణలో సికింద్రాబాద్ ను అగ్ర స్థానంలో కృషి చేస్తున్నామని, ఈ క్రమంలో విరివిగా నిధులను సమకుర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ వెల్లడించారు. బుధవారం సీతాఫలమండి డివిజన్ పరిధిలో ఇందిరానగర్ కాలనీ లో రూ.75 లక్షల ఖర్చుతో బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను, కుట్టి వెల్లోడి ఆసుపత్రి సమీపంలో రూ. 80 లక్షల ఖర్చుతో రోడ్ల నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ ప్రారంభించారు.
కార్పొరేటర్ కుమారి సామల హేమ, తెరస యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్, అధికారులు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ 50 సంవత్సరాల కాలంలో చేపట్టని పనులను కుడా గత 7 సంవత్సరాల్లో చేపట్టామని తెలిపారు. సితాఫలమండీ ప్రభుత్వ స్కూల్ లో జూనియర్, డిగ్రీ కాలేజి పనులను ప్రారంభిస్తామని, కుట్టి వేల్లోడు ఆసుపత్రిని ఆధునీకరించి కొత్త భవనాలను నిర్మిస్తామని తెలిపారు. ఇంద్రా నగర్ కాలనీ లో రూ.6 కోట్లతో వివిధ పనులను కేవలం ఐదేళ్ళ లో చేపట్టామని తెలిపారు.
ఇక మెట్టుగూడ నుంచి ఆలుగడ్డ బావి మీదుగా చిలకల్గుడా ప్రధాన రహదారిలో రైల్వే బ్రిడ్జి (RUB) ట్రాఫిక్ రాకపోకలకు ఇబ్బందికరంగా ఉందని, ఈ బ్రిడ్జి ని విస్తరించాలన్న తమ సూచనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి రూ.30 కోట్ల మేరకు నిధులను మంజూరు చేసిందని తెలిపారు. సీతాఫలమండి-తార్నాకల మధ్య మనికేశ్వరి నగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వల్ల రెండు వైపులా రాకపోకలు సాగించే వారు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రూ.20 కోట్ల ఖర్చుతో RUB నిర్మాణానికి ప్రతిపాదించామని, ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
ఈ రోడ్డు అండర్ బ్రిడ్జ్ వల్ల మనికేశ్వరి నగర్, ఇంద్రా నగర్ ప్రాంతాల్లో 18 మంది కట్టడాలను కోల్పోవాల్సి వస్తుందని, ప్రాంగణాలు కోల్పోయే వారికి తగిన న్యాయం చేకురుస్తామని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అదే విధంగా ఇందిరానగర్ కాలనీ లో కమ్యునిటీ హాల్ ను రెందంతస్తులతో పునర్నిర్మించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న వారిలో అధికారులు ఆశాలత, వై కృష్ణ, అన్విత్ కుమార్, కౌశిక్, ఇందిరానగర్ కాలనీ నేతలు ఉన్నారు.