Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగుల జీతాలు,బకాయిలుపై బడ్జెట్ లో నిధులు కేటాయించాలి

– ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు డిమాండ్ 

నేడు ఆంధ్రప్రధేశ్ లో ఉద్యోగులు,ఉపాధ్యాయులు,కార్మిక,రిటైర్డు,కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల చెందుతున్న ఆవేదనే ఈఉద్యమానికి కారణమని,ఉద్యోగుల కోర్కెలు గొంతెమ్మకోర్కెలు కాదు మాకు రావల్సిన డబ్బులు చెల్లించమని అడుగుతున్నాం.మా బకాయిలు చెల్లించమని అడుగుతున్నాం,
మాజీతాలు,పెన్సన్లు 1 వ తేదినే ఇమ్మని అడుగుతున్నాం.ఇది తప్పా,మాడిమాండ్లు న్యాయం కాదా..? ఉద్యోగుల జీత బత్యాలకోసం బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఏమౌతున్నాయి.ఈప్రశ్నలకు ప్రభుత్వమే సమాదానం చెప్పాలి,మాన్యాయమైన డిమాండ్సు పరిష్కరించాలని చేస్తున్న ఈ ఉద్యమానికి అందరు మద్దతుఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ గురువారం ఉదయం విజయవాడలో ఉన్న ఏపి పశుసంవర్దకశాఖ హెడ్ ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బందిని,అసోషియేషన్ నాయకులను మరియు R&B మరియు APPSC హెడ్ ఆఫీసులలో పనిచేస్తున్న వివిధ అసోషియేషన్ నాయకులను సిబ్బందిని కలసి ఉద్యోగుల సమస్యలు సాధనకోసం చేస్తున్న న్యాయమైన పోరాటాని మద్దతు ఇవ్వాలని వచ్చేనెల 5 వరకు జరుగుతున్న నల్లబ్యాడ్జీల నిరసన కార్యక్రమాలలో అందరు పాల్గొనాలని ఈనెల 21 నుండి చేపట్టనుండి వర్కుటూరూల్ ఉద్యమం కూడా అందరూ విధిగా పాల్గొని ఉద్యమాన్ని జయప్రధం చేయాలని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీజనరల్ పలిశెట్టి దామోదరరావు,అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంపిణి చేశారు.

ఏపిజెఏసి అమరావతి చేపడుతున్న ఉద్యమానికి మద్దతు కోరుతూ గురువారం సాయంత్రం (1)ఛీప్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మిష్టేషన్(CCLA), (2)కమీషనర్ ఆఫ్ ఇండస్ట్రీట్స్,(3) ఏపిఐఐసి కార్యాలయం, (4)డైరీడవలఫ్ మెంటు కార్పురేషన్ (5) కమీషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ & హెల్త్, మెడికల్ డిపార్ట్మెంట్ కార్యాలయాల సిబ్బందితో కలసి సమావేశం మంగళగిరి APIIC భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో బొప్పరాజు మాట్లాడు తూ ఉద్యోగులంతా ఉద్యమానికి మద్దతుపలకాలని, ప్రతి ఒక్కరూ రోజూ నల్ల బ్యడ్జీల ధరించి, 21వ తేదీ నుండి ఖచ్చితంగా వర్క్ టూ రూల్ పాటించాలని, అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే, ఏప్రిల్ 5వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి మలిదశ (భవిష్యత్) కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏ పి జేఏసీ అమరావతి అసోసియేట్ చైర్మన్ టివి ఫణి పేర్రాజు, వైస్ చైర్మన్ Dr వసంతరాయలు, ఏపిరెవిన్యూ అసోషియేషన్ రాష్ట్రప్రధానకార్యదర్శి చేభ్రోలు కృష్టమూర్తి, ఏపిజెఏసి అమరావతి కో- చైర్మన్ యస్.మల్లేశ్వరరావు,కార్యదర్శి ఏ.సాంబశివరావు, NTR జిల్లా రెవిన్యూ అసోషియేషన్ అధ్యక్షు,ప్రధానకార్యదర్శులు డి.శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి బత్తిన రామకృష్ట,రెవిన్యూ అసోషియేషన్ రాష్ట్రకార్యదర్శి ప్రవీన్ రెడ్ఢి తధితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE