– ఆర్యసమాజం పోరాటాలు తెలంగాణకు ఆదర్శం
– పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
– ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
– ప్రసాద్ లాబ్స్ లో ‘రజాకర్’ సినిమా వీక్షించిన అనంతరం మీడియాతో : బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
రజాకర్ చిత్ర నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి కి ప్రత్యేక అభినందనలు. సినిమాను కమర్షియల్ ఎలవెంట్స్ లేకుండా, నిజాం పాలనలో రజాకార్లు ప్రజలపై చేసిన దాడులు, అరాచకాల గురించి వాస్తవంగా చూపిస్తూ చరిత్రను కళ్ల ముందు ఉంచారు.
బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, పరకాల, నిర్మల్ వెయ్యి ఉరుల చెట్టు, జోడేఘాట్ వంటి చారిత్రక ప్రదేశాలు, ఆ ప్రాంతాల్లో జరిగిన పోరాటాలు వివరంగా చూపించారు.. భావితరాలకు చరిత్రను తెలియజేయడం ముఖ్య లక్ష్యం.
హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్ర్యం ఎలా లభించిందో, గ్రామీణ ప్రాంతాల్లో నిజాం పాలనలో జరిగిన అత్యాచారాలు, అరాచకాలను తెలియజేసే విధంగా, అలాగే ఆర్యసమాజ్ వంటి సంస్థలు రజాకర్లకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటాన్ని స్పష్టంగా చూపించారు.
గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ‘రజాకర్’ సినిమాకు అవార్డు ప్రకటించింది. గూడూరు నారాయణరెడ్డి చారిత్రాత్మకంగా మంచి సినిమా తీశారు. కాబట్టి అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యకర్తల ద్వారా ప్రజలకు సినిమా చూపించే ప్రయత్నం చేస్తాం. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ లో వేడుకలు జరగనున్నాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊరిలో భారత జెండాను ఎగురవేసి అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం.