Suryaa.co.in

Andhra Pradesh

జీవో నెంబర్ 42,50,51 ఉపసంహరించుకోవాలి

– టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ 
రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా వ్యవస్థకు నిధులు నిలిపేస్తూ జీవో నెం. 42, 50, 51 జారీ చేయడం అన్యాయమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు.ఆయన విలేఖరులకు ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…! 42, 50, 51 జీవోలను ఉపసంహరించుకోవాలని అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పటికినీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
విద్యాశాఖ మంత్రి ప్రెస్ మీట్ నిర్వహిస్తుంటే టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు తమ వాణి వినిపిద్దామని శాంతీయుతంగా వెళ్లి వినతిపత్రం ఇద్దామనుకుంటే వారి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పోలీసులను అడ్డు పెట్టుకొని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వినోద్ కుమార్, నిమ్మగడ్డ సాత్యసాయి, వేపాకు శ్రీనివాస్, విజయ్ లను, వివిధ విద్యా సంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు.
ఈ అరెస్టులను టీఎన్ఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది. జగన్ కు విద్యా విలువలు తెలియవు. పాలనా విధానం తెలియదు. జగన్ అనాలోచిత విధానాలతో నేడు విద్యార్థులంతా రోడ్డున పడాల్సి వచ్చింది. విద్య పట్ల అవగాహనా రాహిత్యంతో విద్యార్థులను అనేక విధాలుగా ఇబ్బందులపాలు చేశారు. పాదయాత్రప్పుడు ఇంట్లోని ప్రతి పేద బిడ్డని చదివిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక పేద బిడ్డల తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి మా బిడ్డలను చదివించరా బాబు అంటూ అడుక్కొనే పరిస్థితి తెచ్చారు.
అరెస్టు చేసిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులను వెంటనే విడుదల చేయాలి, తక్షణమే జీవో నెంబర్ 42, 50, 51 లను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తాం. మరీ లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

LEAVE A RESPONSE