Suryaa.co.in

Andhra Pradesh

ఆంధ్రరత్న భవన్ లో ఘనంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

విజయవాడ: మనం మారితే… ప్రపంచం మారుతుందనే మహాత్మా గాంధీ సూక్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో సోమవారం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ముందుగా ఇరువురి చిత్ర పటాలకు పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నాయకులు అందరూ కొంత సమయం ధ్యానంలో గడిపారు. దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడైన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అని ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు కొనియాడారు. కనీసం సొంత కారు కూడా లేకుండా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడం ఆయన నిజాయితీ, నిరాడంబరతకు గుర్తు అన్నారు.అదే విధంగా నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ వంటి ప్రపంచ స్థాయి నాయకులు ఎందరో మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకున్నట్లు స్వయంగా వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కార్యక్రమంలో కార్యనిర్వహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ సభ్యులు మేడా సురేష్, ధనేకుల మురళి, కొలనుకొండ శివాజీ, మీసాల రాజేశ్వరరావు, ఖాజా మొహిద్దీన్, ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ వి. గుర్నాధం, ముఖ్య నాయకులు యలమందారెడ్డి, మూల వెంకట్రావు, వడ్డీ సోమ శేఖర్, డాక్టర్ జంధ్యాల శాస్త్రి, వేముల శ్రీనివాస్, గౌస్, బైపూడి నాగేశ్వరరావు, నాగూర్, ఖుర్షీదా, జేసుదాసు, మోవ్వా మోహనరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE