మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
హైదరాబాద్: ఎన్నికల ముందు రైతులకు రేవంత్ రెడ్డి ఆశ కల్పించారు. రుణమాఫీ, రైతు భరోసా,పంట బోనస్ ఇస్తామని అన్నారు. వరి పంట బోనస్ సన్న వడ్లకే ఇస్తామని అంటున్నారు. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. తెలంగాణలో ప్రత్తి పంటకు మద్దతు ధర పలకడం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
దొడ్డు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. రైతుబంధు మూడు పంటలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలి. ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీలు ఇచ్చింది వాస్తవం కాదా? ప్రజలు ప్రశ్నిస్తే వచ్చిన తప్పు ఏంటి?
ఎన్నికల ముందు సోషల్ మీడియా యూనివర్సిటీ పెట్టి బిఆర్ఎస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాలి. పాలనపై కాంగ్రెస్ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
కుట్రపూరితంగా బిఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టాలని చూస్తున్నారు. పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్ లో ఏం జరిగిందో చెప్పాలి. ప్రభుత్వ కుట్రలను ఎదుర్కొవాదానికి సిద్ధంగా ఉన్నాము.