భారత 16వ రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఇవాళ విడుదల చేసింది. ఈ నెల 29 వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయొచ్చు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు జూన్ 2న ముగుస్తుంది. పోలింగ్ వచ్చే నెల 18న జరుగుతుంది. 21న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం వచ్చే నెల 24తో ముగుస్తుంది. రహస్య బ్యాలట్ విధానంలో ఈ ఎన్నికలు జరుగుతాయి. లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. ఢిల్లీ, పుదుచ్చేరి శాసన సభల సభ్యులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల్లో 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అర్హులు. మొత్తం ఓట్ల విలువ 10,86,431.