Suryaa.co.in

National

నేపాల్‌లో క్రైస్తవుల ఘర్‌ వాపసీ

నేపాల్ లో 288 కుటుంబాలకు చెందిన 1421 మంది మతం మారిన హిందువులు తమ స్వధర్మంలోకి వచ్చారు. గత కొంతకాలంగా నేపాల్ ను టార్గెట్ చేసుకుని చైనా కమ్యూనిస్టుల ప్రభుత్వం, మరోవైపు క్రైస్తవులు ఇంకొక వైపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహింగ్యా చొరబాటుదారులు చిన్న దేశం నేపాల్ లోకి వేలాదిగా రావడం, స్థానిక హిందువులను ప్రలోభాలతో ఆకర్షించి, లేదా బెదిరించి వారిని మతం మార్చి తమ చెప్పుచేతల్లో పెట్టుకుం న్నారు. ఈ పరిస్థితిని గమనించిన నేపాలీ హిందువులు ఆలస్యంగా అయినా మేల్కొంటున్నారు. ఇలా మతం మార్చడానికి వచ్చే మాయగాళ్లకు గట్టి సమాధానమే చెప్పారు.

నేపాల్ లోని ‘సున్సారి జిల్లాలో’ 288 కుటుంబాలకు చెందిన 1421 మంది హిందువులను మాయమాటలతో తప్పుడు హామీలతో ప్రలోభాలకు గురిచేసి విదేశీ చర్చ్ క్రైస్తవులుగా మార్చింది. నేపాల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మతం మార్చబడిన వారందరినీ యజ్ఞం నిర్వహించి పూలవర్షం కురిపించి తిరిగి వారి అసలు ధర్మంలోకి స్వాగతం పలుకడం జరిగింది.

నేపాల్ దేశపు విశ్వహిందూ పరిషత్ సెక్రటరీ జితేందర్ మాట్లాడుతూ సృష్టిలోని సర్వప్రాణులయొక్క మరియు ఝడచేతనాల యొక్క శ్రేయస్సును కోరే వారు ఎవరూ లేరని వివిధ మతాలు, సిద్ధాంతాలు ప్రచారం చేసే వారందరూ ప్రకృతిని దోచుకోవడం కోసమే తమ అనుయాయులకు చెబుతుంటారని.. ప్రపంచంలోని ప్రతి వారి శ్రేయస్సును కోరేవారు, పంచభూతాలను గౌరవించి దేవతలుగా ఆరాధించే ప్రకృతి ఆరాధకులు కేవలం హిందువులేనని వారి సంఖ్య తగ్గిపోతే ప్రపంచ శ్రేయస్సు కోరే వారే కరువు అవుతారని ప్రపంచం అంతా కల్లోలమే అవుతుందని ప్రకటిస్తూ..హిందువుల సంఖ్య తగ్గడానికి వీల్లేదని సంఖ్య పెంచడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు.హిందూ దేశమైన నేపాల్ ను క్రైస్తవ దేశంగా మార్చడం కోసం కేరళ నుండి మతంమార్పిడి మాయగాళ్లు వస్తున్నారని వారందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

~ ఆకారపు కేశవరాజు

LEAVE A RESPONSE