Suryaa.co.in

Andhra Pradesh

వరికెపూడిశెల లిఫ్ట్ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వండి

పల్నాడు ప్రాంతానికి పెద్దమొత్తంలో నీటిని అందించగల వరికెపూడిశెల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి భుపిందర్‌ యాదవ్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో కలసి కోరారు.

ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని తెలిపారు. పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలంలోని, గంగలగుంట గ్రామ సమీపంలో నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ ముందు ఉన్న నది ప్రాంతాన్ని..అనేక అధ్యాయల తర్వాత ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా ప్రతిపాదించడం జరిగిందని తెలిపారు. ప్రతిపాదిత ప్రాజెక్టు కింద పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలంలో.. వెల్దుర్తి, ఉప్పలపాడు, గంగలకుంట, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బోదిలవీడు లోయపల్లి, గ్రామాల్లో 24,900 ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు.

పల్నాడు ప్రాంతంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇస్తే.. ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగులు పడతాయని, ఇందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు.

LEAVE A RESPONSE