– ఎక్స్ప్లోర్ చేయని బ్లాక్స్‌ని కూడా ఆక్షన్‌లో పెడుతున్నారు
– మైనర్ మినరల్స్ పరిస్థితి దారుణం
– పర్యావరణ అనుమతులు కూడా మైనింగ్ లీజ్ పీరియడ్ తో సమానంగా ఉండాలి
– ఒక సారి అనుమతిస్తే, లీజ్ టైం వరకు వాలిడిటీ ఇవ్వాలి
– ఎంపీ వద్దిరాజు రాజ్యసభలో ప్రసంగం
న్యూఢిల్లీ: మన దేశంలో మేజర్ మినరల్స్ కంటే మైనర్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని, 2,000 కన్నా తక్కువ మేజర్ మినరల్ మైన్స్ ఉంటే, 60,000 పైగా మైనర్ మినరల్ మైన్స్ ఉన్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. ఇవి 30 మిలియన్ల మందికి పైగా ప్రజల జీవనోపాధిని ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు.
గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ -2025 బిల్లును బొగ్గు గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,ఇవి అధిక నియంత్రణలో, గుర్తింపు తక్కువగా, పాతకాలపు విధానాలలో ఇరుక్కుపోయాయని పేర్కొన్నారు.
ప్రపంచ రాజకీయాలు, జియోపాలిటిక్స్ కూడా ఇప్పుడు మినరల్స్ చుట్టూ తిరుగుతున్నాయని, మన దేశానికి ఉన్న జియోలాజికల్ పొటెన్షియల్‌ను ్రైవేట్ పెట్టుబడుల ద్వారా వెలికితీయకపోతే, మనం ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించలేమని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పదేళ్ల పాలనలో గ్రానైట్ ఇండస్ట్రీని కాపాడే విధంగా ఎన్నో సంస్కరణలు అమలు చేశారని ఎంపీ వద్దిరాజు వివరించారు. స్లాబ్ సిస్టమ్స్ ఏర్పాటు చేసి ఫ్యాక్టరీలను ఆదుకున్నారని చెప్పారు.
ఇప్పుడు 515 మేజర్ మినరల్ బ్లాక్స్ ఆక్షన్‌లో పెట్టారని,అందులో 12% మాత్రమే ఆపరేషనల్ అయ్యాయని, మైనర్ మినరల్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నారు. ఎక్స్ప్లోర్ చేయని బ్లాక్స్‌ని కూడా ఆక్షన్‌లో పెడుతున్నారన్నారు.
ఇది కార్టెల్ లావాదేవీలు, గనులు మూసివేత, ఇన్వెస్టర్ల వెనుదిరుగుదలకు దారి తీస్తున్నదని చెప్పారు.
ఈ సందర్భంగా తాను కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదల్చానన్నారు.
ఆక్షన్ రిజర్వ్ చేయాలంటే, సరైన ఎక్స్‌ప్లోరేషన్ అయిన పెద్ద బ్లాక్స్నే పెట్టాలని, 10 హెక్టార్ల లోపు లీజులకు First-Come-First-Serve విధానం కొనసాగించాలన్నారు
లీజ్ హోల్డర్స్ లిథియా కోబాల్ట్ గ్రానైట్ వంటి ముఖ్యమైన ఖనిజాలను అదనపు రాయాలిటీ లేకుండా చేర్చుకోవాలని ఎంపీ రవిచంద్ర చెప్పారు. దీనివల్ల భూవినియోగం సమర్థవంతమవుతుందని, ఉద్యోగ అవకాశాలు ఇంకా పెరుగుతాయని తెలిపారు.
మినరల్ ఎక్స్చేంజీలు ఏర్పాటు ద్వారా న్యాయమైన ధరలు, మధ్యవర్తుల దోపిడీ తగ్గడం, స్థిరమైన మార్కెట్ సాధ్యమవుతుందని చెప్పారు. మైనర్ మినరల్ పన్నులు 200% నుంచి 450% వరకు ఉన్నాయని, ఇలీగల్ ట్రేడ్‌కి కారణమవుతున్నదని,“One Nation, One Mineral, One Tax” మోడల్ అమలు చేస్తే బాగుంటుందని ఎంపీ రవిచంద్ర సలహానిచ్చారు.
టాక్స్ రేట్లు, రెవెన్యూ న్యూట్రల్‌గా ఉంచాలన్నారు. మేజర్ మినరల్స్‌పై 2% DMET వసూలు చేసేవారు, ఇప్పుడు 3% పెంచారన్నారు. తెలంగాణలో మైనర్ మినరల్స్‌పై 2% SMET వసూలు చేస్తున్నారని, కానీ వసూలైన డబ్బు బ్యాంక్ అకౌంట్లలోనే ఉందని, అభివృద్ధి పనులకు వినియోగం లేదని ఎంపీ వద్దిరాజు తెలిపారు.
DMET, SMET ద్వారా వసూలైన మొత్తం ఎంత? అందులో ఎంత శాతం నూతన ఎక్స్‌ప్లోరేషన్, సర్వేలకు వినియోగిస్తున్నారని ఎంపీ రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొత్తగా ప్రతిపాదిస్తున్న DMEDT ద్వారా అభివృద్ధి పనులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉండాలని ఎంపీ రవిచంద్ర సూచించారు.
గ్రానైట్ ఇండస్ట్రీ కొన్ని లక్షల మందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని ఆయన వివరించారు. లీజ్ పీరియడ్ ఒకసారి మైన్ గ్రాంటింగ్ ఇచ్చినచో EC పూర్తి కాలం ఉండాలని, 0 నుండి 5 హెక్టార్ల వరకు B2 కేటగిరీలో వస్తే, పబ్లిక్ హియరింగ్ అవసరం లేదని ఎంపీ రవిచంద్ర చెప్పారు. కేవలం అప్లికేషన్, EMP రిపోర్ట్, REIAA స్క్రూటిని చేసి 15 రోజుల్లోనే అనుమతులివ్వాలని సలహానిచ్చారు.
5 నుండి 25 హెక్టార్ల వరకు కూడా ఇదే విధానం, గరిష్టంగా 15 రోజులు,25 నుండి 100 హెక్టార్ల వరకు B1 కేటగిరీ – పబ్లిక్ హియరింగ్ తప్పనిసరి, MoEF నిబంధనల ప్రకారం 6 నెలల లోపు అనుమతి, 100 హెక్టార్లకు పైగా A కేటగిరీ – పబ్లిక్ హియరింగ్ తప్పనిసరి, MoEF నిబంధనల ప్రకారం 9 నెలల లోపు అనుమతులు ఇవ్వాల్సి ఉండగా, ఆచరణలో అవి సమయానికి రావడం లేదని ఆయన పేర్కొన్నారు.
అందుకే నా వినతి ఏమిటంటే, పర్యావరణ అనుమతులు కూడా మైనింగ్ లీజ్ పీరియడ్ తో సమానంగా ఉండాలని, ఒక సారి అనుమతిస్తే, లీజ్ టైం వరకు వాలిడిటీ ఇవ్వాలని ఎంపీ వద్దిరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అసలు గ్రానైట్ పరిశ్రమకు పర్యావరణం అనుమతులు అవసరం లేకుండా చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.