Suryaa.co.in

Andhra Pradesh

115 జీవోను రద్దు చేయాలి

సత్తెనపల్లి: 115 జీవోను రద్దు చేయాలని కోరుతూ సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలోని స్టాఫ్ నర్సులు శనివారం ఏరియా వైద్యశాలలో ఆందోళన చేశారు. ఎన్నో ఏళ్ళుగా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న స్టాప్ నర్సులను కాదని ఏఎన్ఎం లకు పదోన్నతులు కల్పిస్తూ విడుదల చేసిన జీవోను రద్దు చేయాలన్నారు. జీవో వల్ల తమ భవిష్యత్తులో రెగ్యులర్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించకపోతే ఆందోళన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రెగ్యులర్ స్టాఫ్ నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది వారికి మద్దతు తెలిపారు. నర్సింగ్ సూపరింటెండెంట్‌ రాధా, హెడ్ నర్సు బంగారు పాప, నర్సింగ్ సిబ్బంది, మద్దతు తెలిపారు.

LEAVE A RESPONSE