– గ్రామీణ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదానికి ధన్యవాదాలు
– గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపిని అత్యధిక స్థానాల్లో గెలిపించాలి
– ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారు
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల ఫేజ్–1 ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి గ్రామీణ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదానికి హృదయపూర్వక ధన్యవాదాలు. బిజెపి మంచి విజయం సాధించడం… గ్రామాల్లో పార్టీ క్రమేణా బలోపేతం అవుతోందని, ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామపంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉంది.
గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు- కొత్త రోడ్లు, వీధి దీపాలు, స్మశానవాటికలు, రైతు వేదికలు, పేదల కోసం ఉచిత బియ్యం, పక్కా ఇండ్లు, మరుగుదొడ్లు, ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లు, మహిళ సంఘాలకు రుణాలు, యువతకు స్వయం ఉపాధి పథకాలు, ఉపాధి హామీ నిధులు, తాగునీరు, ఆరోగ్య భద్రత, PM-KISAN వంటి పథకాలు – గ్రామీణ జీవనాన్ని గణనీయంగా మార్చుతున్నాయి. ఈ అభివృద్ధి పట్ల ఉన్న ప్రజల నమ్మకమే బిజెపికి వచ్చిన ఈ విజయానికి కారణం.
ఇంకా మిగిలిన స్థానిక సంస్థల ఫేజ్–2, ఫేజ్–3 ఎన్నికల్లో బిజెపి మరింత బలంగా పోటీ చేస్తుంది. బిజెపి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి- ప్రజల్లోకి వెళ్లండి, గ్రామాల్లో కేంద్రం చేస్తున్న అభివృద్ధిని వివరించండి, బిజెపిని మరింత బలపరచండి. గ్రామాల అభివృద్ధి కోసం… గ్రామ భవిష్యత్తు కోసం… మిగిలిన రెండు దశల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిజెపిని అత్యధిక స్థానాల్లో గెలిపించాలని ప్రజలకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.