Suryaa.co.in

Andhra Pradesh

ఆ హామీల అమలు సంగతి దేవుడెరుగు..వీటి సంగతేంటి జగన్ రెడ్డీ?

-కోడికత్తి డ్రామాలో అమాయకుడైన శ్రీను నాలుగేళ్లుగా జైలులో మగ్గిపోతున్నాడు
-ప్రజలకు ఇఛ్చింది పావలా అయితే వారిపై పెట్టిన భారం ఒకటిన్నర రూపాయ్
-మీ మోసాలన్నీ పక్కన పెడదాం.. కనీసం ఈ 10 అంశాలకు సంబంధించి సమాధానం చెప్పే ధైర్యం మీకుందా?
-తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి నోర్లు చించుకుంటున్న వారు మంత్రులా, ఫ్లాట్ ఫారమ్ సరుకా
-మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీలా ప్రజలకు అన్యాయం చేయలేదు..జీవితాన్ని జనం కోసం అంకితం చేసి శక్తికి మించి పనిచేశారు..మళ్లీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు
-మీడియాతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

మహిళలు, రైతులు, యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మహానాడులో మేనిఫెస్టో ప్రకటించారు.ఆ రోజు నుంచి వైసీపీ నాయకులు, సీఎం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అందరూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మంత్రులైతే తమ హోదాను కూడా మరిచిపోయి బరితెగించి మాట్లాడారు. ఇరిగేషన్ మంత్రి అంబటి మాటలైతే మరీ సంస్కార హీనం.జగన్ రెడ్డి 98.7 శాతం హామీలు అమలు చేశారని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వైసీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.చంద్రబాబు నాయుడు మీలా ఎవరికి అన్యాయం చేయలేదు. దుర్మార్గంగా పన్నులు భారం మోపలేదు…అవినీతి, దురాశతో ప్రజల సొత్తును దోచుకోలేదు.

జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచిన చరిత్ర ఆయనది.98.7 శాతం హామీల అమలు సంగతి దేవుడెరుగు..జగనన్న ఇవ్వని హామీలు కూడా అనేకం అమలు చేశారు.
1. నాలుగేళ్ల పాలనలో 8 సార్లు విద్యుత్ సార్లు పెంచాడు..ఇది మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కాదు కదా
2. ప్రజలు కోరకుండానే పేదలు తిరిగే బస్సు ఛార్జీలను భారీగా పెంచి శెభాష్ అనిపించుకున్న ఘనత కూడా జగనన్నదే
3. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా స్టేట్ పన్నులను ఎడాపెడా వేసి పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా పెంచారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకతో పోలిస్తే లీటర్ డీజిల్ కు రూ.12 ఎక్కువగా గుంజడాన్ని కూడా హామీ ఇవ్వకుండా అమలు చేస్తున్నారు కదా
4. ఏట్లో ఉచితంగా దొరికే ఇసుకకు ధర నిర్ణయించి వేల కోట్లు దోచుకుంటామని మీ మేనిఫెస్టోలో ఉందా
5. సంపూర్ణ మద్యపాన నిషేధమని సొంత బ్రాండ్ల చీఫ్ లిక్కర్ ను అధిక ధరలకు అమాయకులకు పోస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాటడం కూడా జగనన్న ఘనతల్లో ఒకటి
6. మాట ఇవ్వకుండానే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చేశారు. అప్పును రూ.10 లక్షల కోట్లకు, పెండింగ్ బిల్లులను రూ.2 లక్షల కోట్లకు చేర్చడంలో జగనన్న కృషి ఎనలేనిది
7. పీఎం నరేంద్రమోదీ నిరంతరం డిజిటిల్ ఇండియా అంటూ గొప్పగా చెబుతుంటారు. ఇక్కడ మా జగనన్న మాత్రం శాండ్, వైన్, మైన్ వ్యవహారాల్లో ఓన్లీ క్యాష్ అంటూ కంటైనర్లలో నోట్ల కట్టలు తరలిస్తున్నారు
8. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేసిన జగనన్న పేరును రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిందే
9. ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేసి పడేసిన జగనన్నను ప్రభుత్వ ఉద్యోగులు జీవితంలో మరిచిపోరేమో
10. ఏటా జనవరిలో జాబ్ కేలండర్ విడుదల చేసి లక్షల ఉద్యోగాలు భర్తీ ఏపీలో నిరుద్యోగ సమస్యను పత్తా లేకుండా చేసిన నాయకుడు జగనన్న

98.7 శాతం హామీలు నెరవేర్చామని డబ్బాలు కొట్టుకుంటున్న వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ 10 ముఖ్యాంశాలతో పాటు మీరు ఇలా ప్రజలను వంచించిన అన్ని అంశాలను వివరించండి.
జగన్ రెడ్డి కేబినెట్ లో చేతకాని మంత్రులు తయారై ప్రజలకు కష్టనష్టాలకు గురిచేస్తుండటం దురదృష్టకరం..వారి భాష చూస్తుంటే మంత్రులా, ప్లాట్ ఫారం సరుకో అర్థం కావడం లేదు.కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడిస్తారో తెలియదు..చివరకు ఉద్యోగులు ఆత్మహత్యాయత్నం చేసుకునే పరిస్థితులు తెచ్చారు.

దేశమంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చెల్లుతాయోమో కానీ మా జగనన్న ఫ్యామిలీ చేసే వ్యాపారాల్లో మాత్రం కుదరవు..కేవలం క్యాష్ ను మాత్రమే అంగీకరిస్తాం.జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న అనేక వ్యవసాయ పథకాలు ఏపీలో కనిపించవు. తలసరి రైతు అప్పును రూ.2.45 లక్షలకు చేర్చారు. రైతు ఆత్మహత్యల్లో జనాభా ప్రాతిపదికన ఏపీని అగ్రస్థానంలో నిలిపారు.ప్రజలకు ఇఛ్చింది పావలా అయితే వారిపై పెట్టిన భారం ఒకటిన్నర రూపాయ్.జగనన్న దెబ్బకు పోలీసులు కూడా అబ్బా అనే పరిస్థితి వచ్చింది.

మీ కోసం జరిగిన కోడికత్తి డ్రామాలో అమాయకుడైన శ్రీను నాలుగేళ్లుగా జైలులో మగ్గిపోతున్నాడు..ఈ ఘటనలో కుట్రకోణం లేదని ఎన్ఐఏ తేల్చినా ఆ యువకుడికి విముక్తి లేదు.దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఇంటికి పార్శిల్ పంపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మాత్రం నాలుగు నెలల్లో బెయిల్ ఇప్పించడమే గాక ఊరేగింపులు, ర్యాలీలు.

గొడ్డలి పోటు కేసులోనూ నిందితుల తరఫున మీ కృషి అమోఘం. ఇవన్నీ మీ నాలుగేళ్ల పాలనలో సాధించిన ఘనతలు జగన్ రెడ్డీ. మొత్తంగా నాలుగేళ్ల పాలనలో విధ్వంసం, అరాచకాలు, అక్రమ కేసులు, కక్షసాధింపులు, దోపిడీ, హత్యలతో ఆంధ్రప్రదేశ్ ను అయోమయంలోకి నెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ వాసులమని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి తెచ్చారు.

LEAVE A RESPONSE