Suryaa.co.in

Telangana

దేశం కోసం, ధర్మం కోసం జైలుకు వెళుతున్నం!

– జర్నలిస్టు సంఘాలు సీఎం మోచేతి నీళ్లు తాగుతున్నయా?
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ముఖ్యమంత్రులకు స్పూర్తి ప్రదాత మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం చేపడుతున్న ఆందోళనలకు భరోసా కల్పించి ఆశీర్వదించడానికి వచ్చినందుకు ధన్యవాదాలు.
కార్యకర్తలారా… కేసులకు భయపడతామా?… (లేదు.. లేదు.. అంటూ కార్యకర్తలు చేతులెత్తి నినాదాలు) కేసీఆర్ …. కేసులు, అరెస్టులే ఆయుధంగా మారితే జైళ్లు, బందీఖానాలే బీజేపీకి అడ్డాగా మారతాయి. రాజాసింగ్ పై వందల కేసులున్నయ్. దొంగ తనాలో, లంగా తనాలో చేసి, కబ్జాలు చేసి జైళ్లకు పోవడం లేదు. దేశం కోసం, ధర్మం కోసం జైలుకు వెళుతున్నం.

బండి సంజయ్ కు జైళ్లు కొత్త కాదు.. 9 సార్లు జైలుకు పోయిన. అదే బ్యారక్ లో ఉన్నా.మళ్లీ పోరాటం చేసి జైలుకు వెళ్లేందుకు నేను సిద్ధం. ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఉసురు పోసుకుంటుంటే చూస్తూ ఊరుకునే పార్టీ బీజేపీ కాదు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ. రాష్ట్రంలో నువ్వు అధికారంలో ఉంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే సంగతి గుర్తుంచుకో.

దళిత మహిళ అని చూడకుండా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభను జైల్లో పెడతారా? కార్యకర్తల కాళ్లు, చేతులు విరగ్గొడతారా? ఏం తప్పు చేసిండ్రని కోడతారు? మేం ఎవరి కోసం ఉద్యమాలు చేస్తున్నం. ఉద్యోగ, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నం. కాళ్లు, చేతులు విరిగినా… భయపడని వాళ్లు బీజేపీ కార్యకర్తలు. గాయాలు తగ్గగానే కాషాయ జెండా ఎత్తి మళ్లీ యుద్ద రంగంలోకి దిగేందుకు నా తమ్ముళ్లు, అన్నలు సిద్ధంగా ఉన్నరు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసిన పాపమేంది? నీ 317 జీవో వల్ల వాళ్లు పరాయి వాళ్లుగా మారే ప్రమాదం ఏర్పడింది. మరి దేనికోసం తెలంగాణ సాధించుకుంది? ఆనాడు స్థానిక నియామకాల కోసం పిడికిలి బిగించి గర్జించి సకల జనుల సమ్మె చేస్తే తెలంగాణ సాధించినం. కేసీఆర్ సీఎం అయ్యిండు. కానీ ఈ ముర్ఖుడు వాళ్లనే ఇబ్బంది పెడుతుండు.

విడో, దివ్యాంగులు, భార్యాభార్యలకు బదిలీల్లో అవకాశం కల్పించడ లేదు. ఈ మూర్ఖుడి ఇచ్చిన జీవో వల్ల మొన్న మహబూబాబాద్ లో గుండెపోటుతో చనిపోతే ఈ రోజు పెద్దవూరలో మురళీ అనే ఉద్యోగి చనిపోయిండు. ఇంకా ఎంత మందిని బలికొంటావు సీఎం? మా నాన్న ఉపాధ్యాయుడు. మీరంతా

బాధపడుతుంటే… నాకన్న తండ్రి బాధపడ్డట్లే అన్పిస్తోంది. అందుకే నా రక్తం మరుగుతోంది.
కొందరు ఉద్యోగ సంఘాల నాయకులను ఈ సీఎం సంకనేసుకుని టీచర్లను గోస పెడుతున్నడు. ఉద్యోగ సంఘాల నేతల్లారా… ఇంకా ఎన్నాళ్లు మౌనంగా ఉంటారు?

మీ కోసం డాక్టర్ లక్ష్మణ్ వంటి పెద్ద వాళ్లను కూడా అక్రమంగా అదుపులోకి తీసుకుని రాత్రంతా చలిలో ఉంచారంటే ఈ ప్రభుత్వం ఎంతటి రాక్షసంగా వ్యవహరిస్తుందో ఆలోచించండి.నల్గొండలో పనిచేసే ఉద్యోగి ఆదిలాబాద్ పోయి పనిచేస్తూ ఆయన, కుటుంబ సభ్యులు అక్కడే శాశ్వతంగా నాన్ లోకల్ గా ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.

కరీంనగర్ జిల్లాలో పనిచేయాల్సిన దామోదర్ అనే ఉద్యోగి కలెక్టర్ ను కలిస్తే సీఎం కు పంపితే న్యాయం జరగడం లేదు. ఓ పద్దతి, ప్రణాళిక లేకుండా ఉద్యోగ, ఉపాధ్యాయులను గోస పెడుతుండు.
ఇలాంటి మూర్ఖపు సీఎంను గుణపాఠం చెప్పాలి. సీఎం సంకనాకే నాయకుల భరతం పట్టండి…మీకు అండగా బీజేపీ ఉంటుంది. ఉద్యమించేందుకు సిద్ధం. లాఠీ దెబ్లలు తినేందుకు… జైలుకు వెళ్లేందుకు సిద్ధం. ఉద్యోగ, ఉపాధ్యాయులారా… బయటకు రండి.. పిడికిలి బిగించి పోరాడండి.

ఈ ముఖ్యమంత్రి స్పందించకంటే… 2023లో బీజేపీ ప్రభుత్వం రాబోతోంది. ఇక్కడున్న వాళ్లలో ఎవరు సీఎం అయినా 317 ఉత్తర్వును రద్దు చేయిస్తాం. సొంత జిల్లాలకే ఉద్యోగ, ఉపాధ్యాయులను బదిలీ చేసి తీరుతాం. ఆ గురుతర బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది. నా పార్లమెంట్ కార్యాలయంపై దాడి చేస్తారా? ఏం తప్పు చేశాం? లక్ష మెజారిటీతో కరీంనగర్ ప్రజలు గెలిపించిండ్రు. బీజేపీ నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కొట్లాడమని చెప్పింది.

నేను నా కార్యాలయంలో శాంతియుతంగా జాగరణ చేస్తే నీకు వచ్చి నొప్పి ఏంది? వాటర్ క్యాన్లు కొడతావా? టియర్ గ్యాస్ వదులుతావా? గ్యాస్ కట్టర్లు పెట్టి గేట్లు బద్దలు కొట్టిస్తవా? కేసీఆర్ నిన్ను వదల.. నిన్ను జైలుకు పంపడం, నిన్ను జైల్లో వేసి తొక్కాలని రాష్ట్రమంతా ప్రజలు కోరుకుంటున్నరు.

•మేం జైలుకు వెళితే… తొందరగా బయటకు తీసుకురావాలని నా తెలంగాణ సమాజమంతా పూజలు చేస్తోంది.
నువ్వు జైలుకు పోతే… శాశ్వతంగా జైల్లోని ఉండాలని ప్రజలంతా పూజలు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలపై యూ ట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుంటే… వారిపై అక్రమంగా అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ పేరుతో టార్చర్ పెడుతుండు. తక్షణమే వారిపై పెట్టిన కేసులు ఉఫసంహరించుకోవాలి. విడిచిపెట్టాలి. లేకుంటే నీ సంగతి చూస్తా..

ఈ సీఎం కు సిగ్గుందా? నీ పార్టీ నాయకుడు… ఇంకో వ్యక్తి భార్యను పక్కలోక రమ్మని అంటుంటే ఇంత వరకు అరెస్టు చేయలేదు. నీకు ఆ వ్యక్తి మద్దతుంది. నేను చస్తే నా భార్య పిల్లలు ఎట్లా బతుకుతారో తెల్వక రామక్రిష్ణ కుటుంబంతో సహా సూసైడ్ చేసుకుంది.

మామూలోళ్లు తప్పు చేస్తే అరెస్టు చేస్తరు. ఎన్ కౌంటర్ చేస్తరు. మరి పెద్దోళ్లు చేస్తే ఎందుకీ మౌనం. ఆ మూర్ఖుడు పోలీసోళ్లను కూడా వదల్లేదు. ఆ మూర్ఖుడిని అరెస్టు చేసి జైలుకు పంపే వరకు ఊరుకోం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కఠినంగా శిక్షించే వరకు పోరాడతాం.

ప్రధానిపై పంజాబ్ లో నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. దేశమంతా పూజించే ప్రధాని మోదీని అడ్డుకోవడం సిగ్గు చేటు. కేసీఆర్ ను తెలంగాణ పొలిమెర దాటించే వరకు తరిమి తరిమి కొట్టాలి. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం బీజేపీ చేపట్టే ఈ ధర్మ యుద్దం లో ప్రతి ఒక్క కార్యకర్త భాగస్వామ్యం కావాలని కోరుతున్నా.

ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపే జర్నలిస్టులను కొట్టడానికి కూడా ప్రత్యేకంగా పోలీసులను నియమించారు. కరీంనగర్ లో వారిపై జరిగిన దాడే అందుకు నిదర్శనం. జర్నలిస్టు సంఘాలు ఏమైపోయినయ్. సీఎం మోచేతి నీళ్లు తాగుతున్నయా? అన్ని వర్గాలు, సంఘాలకు సరైన వేదిక బీజేపీ మాత్రమే. బీజేపీ చేసే పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE