-
విధ్వంసక పాలనే రాష్ట్రాన్ని వెంటిలేటర్ పైకి నెట్టింది
-
రాష్ట్ర పునర్నిర్మాణానికే చంద్రబాబు ఢీల్లీ పర్యటన
-
స్వీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో రాష్ట్రానికి తిరిగి వస్తున్న కంపెనీలు
-
వరదల్లో కనిపించని వ్యక్తులు విమర్శలు చేయడం సిగ్గు చేటు
-
గన్నే ప్రసాద్ (అన్నా)
విధ్వంసక పాలనతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసి పునర్నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పం.
చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మంత్రి మరియు ఏడుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని వివరించి నిధులు సాధించడంతో పాటు అనేక ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించారు
* పోలవరం తొలిదశకు 12, 500 కోట్లు, అమరావతి తొలి దశ నిర్మాణానికి 1500 కోట్లు, రెండేళ్లలో 70వేల కోట్ల రైల్వేశాఖ వచ్చే రూపాయల పనులు, జాతీయ రహదారుల నిర్మాణానికి 55వేల కోట్ల రూపాయలు, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించడానికి 60 వేల కోట్లు కేంద్రం ఖర్చు చేస్తే విధంగా చంద్రబాబు గారు ఢీల్లీ పర్యటనలో నిధులు సాధించారని అన్నారు.
* మరోవైపు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చోరవతో దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వైజాగ్ కు వచ్చిందని తద్వారా పదివేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.
* పారిశ్రామిక వేత్తల సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేష్ చూపిన చోరవతోనే ఈరోజు లులూ, ఒబెరాయ్, బ్రూక్ ఫీల్డ్, సుజలాన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని అన్నారు
* విద్వేషంతో వైసిపి రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేసిందో చూసిన ప్రజలు తమ తీర్పుతో బుద్ధి చెప్పినా ఇంకా జగన్ మోహన్ రెడ్డి తీరు మారలేదు, అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని చంద్రబాబు గారి అనుభవంతో కేంద్ర సహాకారంతో పాటు పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే విధంగా కూటమి ప్రభుత్వము కృషి చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తన మీడియా ద్వారా నిసిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు,
* చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా నెలరోజుల లోపే 450 కోట్ల రూపాయలు ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది, బాబు పై నమ్మకంతోనే దాతలు పెద్ద ఎత్తున సాయం అందించారని
* విజయవాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలను తెరుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నుండి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పది రోజులు శ్రమించి సహాయక చర్యలు చేశారని.
* వైసీపీ నుంచి ఒక్క ప్రజా ప్రతినిధి కూడా కనిపించకపోగా, ప్రభుత్వం చూపిన ఖర్చులను మార్కింగ్ చేసి ఫేక్ ప్రచారం చేయడం సిగ్గుమాలిన పని అని అన్నారు.
* సమాజం పై భాధ్యత, విలువలు లేని వారే ఇలాంటి రాతలు ప్రచారం చేస్తారని, జగన్ మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఈరెండు రాష్ట్రానికి అరిష్టమని తెలిపారు.