Suryaa.co.in

Andhra Pradesh

గుడ్ మార్నింగ్ సీఎం సార్ ..

రావులపాలెం, అమలాపురం మధ్య రోడ్డుని షేర్ చేసి క్యాంపెయిన్ కి జనసేనాని శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై మ‌రోసారి గ‌ళ‌మెత్తారు జ‌న‌సేన (Janasena )పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని, సీఎం జగన్ కు రహదారుల పరిస్థితి తెలిసే విధంగా కొత్త క్యాంపెయిన్ ను మొదలు పెట్టింది. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ సీఎం జగన్ కు చేరుకునే విధంగా ##GoodMorningCMSir అంటూ డిజిటల్ క్యాంపెయిన్ ను సోషల్ మీడియా వేదికగా చేపట్టారు. ఈ క్యాంపెయిన్ లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం రావులపాలెం, అమలాపురం మధ్య ఉన్న రోడ్ల దుస్థితిని తెలిపే ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కొత్త పేట వద్ద ఉన్న గుంతలు .. అక్కడ రహదారి పరిస్థితి తెలియజేసే విధంగా ఉంది. ఈ వీడియో కారులో వెళ్తూ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
ఏపీలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా ఉందొ తెలియజేసేలా ఓ వ్యంగ్య చిత్రాన్ని ఇప్పటికే పోస్ట్ చేశారు. చేస్తూ #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ వేశారు పవన్ కల్యాణ్. సీఎం జగన్ హెలికాప్టర్లో వెళ్తున్నట్టు, సాధారణ జనం రోడ్లపై వెళ్తూ నరకం అనుభవిస్తున్నట్టు ఈ కార్టూన్లు ఉంటున్నాయి. తాజాగా వేసిన కార్టూన్ కూడా ఇలాగే హైలెట్ అవుతోంది.

హ్యాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేయడంలో పవన్ ఫ్యాన్స్ ముందంజలో ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ దూసుకుపోతున్న గుడ్ మార్నింగ్ సీఎం సర్. అంతేకాదు జనసైనికులు, జనసేన కార్యకర్తలు అభిమానులు తమ సమీప ప్రాంతంలోని రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ.. ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ.. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

LEAVE A RESPONSE