చంద్రబాబు అరెస్టుతో జగన్ రెడ్డి అరాచకం పీక్‌కు చేరింది
వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగు కావడం తథ్యం
యువతకు ఉద్యోగాలిచ్చేలా స్కిల్ ప్రాజెక్టును చంద్రబాబు ఏర్పాటు చేశారు
చంద్రబాబుపై కక్షతో స్కిల్ ప్రాజెక్టును జగన్ రెడ్డి కిల్ చేస్తున్నాడు
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 15వ రోజు నిరసన కార్యక్రమాలు
నారా చంద్రబాబు నాయుడు నిద్ర లేచాక తొలి ఆలోచన, నిద్రపోయే ముందు చివరి ఆలోచన రాష్ట్ర అభివృద్ధే. అటువంటి అభివృద్ధి కాముకుడు, విజనరీ నాయకుడిపై జగన్ రెడ్డి కక్షగట్టి తప్పుడు కేసు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై కేసు పెట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు రూపాయి అవినీతి కూడా నిరూపించలేదు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 42 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను పరిశీలించలేదు. కానీ అవినీతి జరిగిపోయిందంటూ మంత్రులు ఎమ్మెల్యేలు పచ్చి అబద్దాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు కృషి ఫలితంగా సుమారు మూడున్నర లక్షల మంది యువత శిక్షణ పొంది లక్షల వేతనాలతో ఉద్యోగాలు పొందినా, ఇంకా అవినీతి అనడానికి జగన్ రెడ్డి ముఠా సిగ్గుపడాలి అని తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన ‘బాబుతో నేను’ కార్యక్రమాలు 15వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగాయి.
నారా చంద్రబాబు నాయుడు క్షేమంగా విడుదల కావాలని కోరుతూ రాజమహేంద్రవరంలోని చర్చిపేట సెయింట్స్ పాల్స్ లూథరన్ చర్చిలో నారా భువనేశ్వరి గారు, కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టారు. రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో ఏర్పాటు చేసిన దీక్షా శిభిరంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి భవానీ పాల్గొన్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో చంద్రబాబు బాల్య స్నేహితులు పాల్గొన్నారు. మా స్నేహం మీద ఒట్టు చంద్రబాబు అలాంటివారు కాదు. కష్టం విలువ తెలిసిన మనిషిపై నిందలేస్తున్నారు. మూర్ఖత్వంతో మంచితనానికి మచ్చ వేయాలని ప్రభుత్వంలో ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు సేవ చేయడం తప్ప నీతి మాలిన రాజకీయాలు తెలియని చంద్రబాబుపై నిందలేసి అరెస్టు చేయడం దుర్మార్గమంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
రేపల్లె నియోజకవర్గంలో మత్యకారులకు చంద్రబాబు అందించిన పరికరాలతో ప్రదర్శన ఏర్పాటు చేసి వినూత్నంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మైదుకూరు నోజకవర్గంలో ఇంఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్షలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
కొవ్వూరు మండలంలో టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు జనసేన నాయకులు టీవీ రామారావు, మహిళా నాయకులు, కార్యకర్తలు మెడకు ఉరి బిగించుకుని నిరసన ద్వారా మద్దతు తెలిపారు.పాణ్యం నియోజకవర్గంలో ఇంఛార్జి గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకుని జగన్ రెడ్డి ప్రజల చెవిలో అబద్దాలతో పువ్వులు పెడుతున్నాడని చెబుతూ నిరసన తెలిపారు.
నూజివీడు నియోజకవర్గంలో ఇంఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ముసునూరు మండలం, గుడిపాడు, వలసపల్లి గ్రామాల నల్ల చెరువులో పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులతో కలిసి జల దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్చార్జి విజయబాబు, 43వ వార్డు ప్రెసిడెంట్, జిల్లా పార్లమెంటరీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ బొడ్డేటి మోహన్ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఐసు గడ్డలపై నిలబడి జగన్ రెడ్డికి ఆ దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ దేవుడిని కోరుకుంటూ నిరసన చేపట్టారు.
చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేశారంటూ జంగారెడ్డిగూడెంలో ఏలూరు కలెక్టర్ నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు పిర్యాదు చేశారు.కురుపాం నియోజకవర్గంలో ఇంఛార్జి తొయ్యక జగదీశ్వరి ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. మాడుగుల నియోజకవర్గంలో ఇంఛార్జి పివిజి కుమార్ ఆధ్వర్యంలో జల దీక్ష నిర్వహించారు. అనంతపురం పట్టణంలోని రుద్రంపేట పంచాయతీ నుండి రామ్ నగర్ బ్రిడ్జి వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముప్పాళ్ల సాంబయ్య పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ వద్ద గల శ్రీ అభయ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం నందు చండీయాగం, రాజశ్యామలా యాగాలను నిర్వహించారు.
నెల్లూరు లోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మాజీ కేంద్ర మంత్రి వర్యులు పనబాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి , కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ,గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఇంఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, తాళ్ళపాక రమేష్ రెడ్డి, అనురాధలు సందర్శించారు. యూనివర్సిటీ నందు వున్న కంప్యూటర్స్, టేబుల్స్ , ట్రైనింగ్ సెంటర్ లో వున్న పరికరాలను,నూతన భవనాన్ని పరిశీలించారు.
టీడీపీ శ్రేణులు అనంతపురంలో భారీ నిరసనలు చేపట్టారు. దార్శనికా క్షమించు.. మా తప్పు మన్నించు అంటూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ద్రంపేట సర్కిల్ నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో టీడీపీ, సీపీఐ, జనసేన నేతలు పాల్గొన్నారు. రుద్రంపేట సమీపంలో కమ్మ భవన్‌ను పోలీసులు చుట్టుముట్టడంతో కొంత మంది నాయకులను గృహనిర్బంధం చేశారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ వాసులతో వెటర్నరీ కాలనీ పార్కు వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వాకర్స్, కాలనీల వాసులు, మహిళలు వచ్చి చంద్రబాబు అరెస్ట్ను ఖండిస్తూ సంతకాలు చేశారు. కాకినాడ సిటీలో వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మోకాళ్లపై కూర్చుని అర్థనగ్న నిరసన చేపట్టి సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.