ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక కవి, రచయిత, తెలుగు అధ్యాపకులు గొట్టిముక్కుల నాసరయ్య … ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బుద్దాల కన్వెన్షన్ హాల్ లో 28 ప్రపంచ రికార్డులు సాధించిన అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో 24 గంటల 24నిమిషాల 24 సెకండ్ల పాటు నాన్ స్టాప్ కార్యక్రమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రపంచ సాహితీ కళా జాతర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో గొట్టిముక్కుల నాసరయ్య పాల్గొని కవితగానం చేశారు.
ఈ సందర్భంగా నాసరయ్యను శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డా. కత్తిమండ ప్రతాప్, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీ భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి డా. పార్థ సారధి, జాతీయ మహిళ అధ్యక్షురాలు చిట్టె లలిత , టీడీపీ రాష్ట్ర మహిళ కార్యదర్శి కె. రాజ్యలక్ష్మి, శ్రీనాధుని 13 తరం వంశీయులు డా. కావూరి శ్రీనివాస శర్మ, స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తదితరుల చేతుల మీదగా ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డు పురస్కార పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ తన కలం ద్వారా తెలుగు భాష, వికాసం, సంస్కృతి సంప్రదాయాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నాసరయ్యను తమ గురువులు, తల్లిదండ్రులు, బంధు మిత్రులు మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల కవులు, కళాకారులు అభినందనలు తెలిపారు.