వైఎస్సార్ 5 ఏళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 ఏళ్లలో ఏ పథకాన్ని రూపొందించినా ప్రజల కోసమే చేశారు. పాలన అంటే వైఎస్సార్ లా ఉండాలి. ప్రపంచం లో ఏ నాయకుడు ఆలోచన చేయని పథకాలను ప్రవేశ పెట్టీ అమలు చేశాడు. ఆరోగ్యశ్రీ,ఫీజు రియంబర్స్ మెంట్ పథకాలు ఇందుకు నిదర్శనం. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు వైఎస్సార్ ఇచ్చాడు. పోడు భూములకు పట్టాలు ఇచ్చారు.
ఇప్పుడు 8 ఏళ్లుగా కేసీఅర్ ముఖ్యమంత్రిగా ఉండి చేసింది శూన్యం. 5 ఏళ్ల నుంచే ఇదే పట్టణంలో ఆసుపత్రి కడుతున్నారు..పూర్తి చేయలేదు. బస్ డిపో ప్రారంభించి బస్సులు తిప్పడం లేదట. పాలమూరు జిల్లాకు వైఎస్సార్ ఎన్నో ప్రాజెక్ట్ లు కట్టారు. 90 శాతం పనులు పూర్తి చేస్తే…10 శాతం పనులు కేసీఅర్ ఇంకా పూర్తి చేయలేదు. కేసీఅర్ ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. రుణమాఫీ అని మోసం… మూడేకరాలు భూమి అని మోసం. మంచి నీళ్ళు లేవు కానీ మద్యం ఫుల్. మద్యం అమ్ముకొని రాష్ట్రం నడిపే పరిస్థితి. కనీసం ఆడవారికి తెలంగాణ లో రక్షణ లేదు.ఆడవారికి..కనీసం చిన్న పిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేని ముఖ్యమంత్రి ఉరి వేసుకొని చావలి. హైదరాబాద్ నడి ఒడ్డున ఒక కార్ లో మైనర్ పై రేప్ జరిగింది. ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. నిందితులకు జైల్లో బిర్యానీ ప్యాకెట్ లు పెట్టారు. ఇల్లు కాలిపోయి ఒకడు ఏడుస్తుంటే….చుట్ట అంటించుకోవడానికి నిప్పు అడిగాడట ఒకడు…ఆ ఒకడు కేసీఅర్.
అప్పులకోసం క్యాబినెట్ మీటింగ్ లు పెట్టి ఏం చేద్దాం అని ప్లానింగ్ లు చేస్తున్నారట. అప్పులు తెచ్చేది ఎందుకు…కమీషన్ల పేరుతో మింగడానికి. తెలంగాణలో కేసీఅర్ పాట్నర్ మెగా కృష్ణా రెడ్డి కే 80 శాతం ప్రాజెక్ట్ లు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ ..ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. మెగా కి దోచి పెట్టడానికి అన్ని కాంట్రాక్టులు కేసీఆర్ ఇస్తున్నారు. ఇద్దరు పాట్నర్స్ కాబట్టే కమీషన్లు మింగడానికి ప్లాన్ వేశారు. పట్టపగలు కమీషన్ల పేరుతో దోచుకు తింటుంటే కాంగ్రెస్, బీజేపీలు చూస్తూ ఉండి పోయాయి. ప్రతి పక్ష పాత్ర కాంగ్రెస్ ,బీజేపీ ఏనాడు పోషించలేదు. ప్రజా సమస్యలను ఎత్తి చూపేందుకు పార్టీ పెట్టాం…ప్రశ్నిస్తున్న. ప్రజల కోసం…ప్రజల పక్షాన నిలబడతా.
బంగారు లాంటి మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఅర్ చేతిలో పెడితే 4 లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశారు. బంగారు తెలంగాణ కేసీఅర్ కుటుంభానికి అయ్యింది. మెగా కృష్ణా రెడ్డి కి అయ్యింది బంగారు తెలంగాణ. తెరాస ఎమ్మెల్యే లకు అయ్యింది బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ…బ్రతుకే లేని తెలంగాణగా చేశారు. ఇది బార్ల తెలంగాణ… బీర్ల తెలంగాణ. తెరాస పార్టీ అకౌంట్ లో 860 కోట్లు డిపాజిట్లు ఉన్నాయట..వాటికి నేలకు 3 కోట్లు వడ్డీ వస్తుందట. తెరాస పార్టీ అకౌంట్ లోనే అన్ని కోట్లు ఉంటే ఆయన కొడుకు దగ్గర..ఆయన అల్లుడు దగ్గర..ఆయన కూతురు దగ్గర ఎంత ఉండాలి. తెలంగాణ లో 8 ఏళ్లుగా 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేస్తున్నారు…
ఏ రైతు కుటుంబాన్ని అడుకున్నది లేదు. కనీసం పరామర్శ కూడా లేదు. కేసీఅర్ కు డబ్బులు సంపాదనే అజెండా. కేసీఅర్ కు రాజకీయాలు చేయడమే అజెండా. ప్రజల సంక్షేమాన్ని కేసీఅర్ ఏనాడు పట్టించుకోలేదు. ఎన్నికలు వస్తున్నాయి… మళ్ళీ వస్తాడట. గాడిదకు రంగు పూసి ఆవు అని నమ్మిస్తారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసినా ఉపయోగం లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యే లు సంతలో పశువుల్లా అమ్ముడు పోతారు. బీజేపీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది. అరిగి పోయిన గ్రాం ఫోన్ లా కేసీఅర్ అవినీతిపై ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ బీజేపీ ఆ ఆధారాలు మాత్రం బయట పెట్టదు.
విభజన హామీలు నెరవేర్చి ఉంటే.. పెద్ద మొత్తం లో ఉద్యోగాలు కల్పన జరిగేది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ…బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇచ్చి ఉంటే ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేవి. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమి లేదు. మీరు ఆశీర్వదించండి… వైఎస్సార్ సంక్షేమ తెలంగాణను తీసుకు వస్తా…ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు, పోడు భూములకు పట్టాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం…ఆరోగ్యశ్రీ పథకాలకు పునర్ వైభవం.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమం కోసం పని చేస్తాం.