Suryaa.co.in

Andhra Pradesh

అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు

– దీపావళి నుంచి మూడు సిలిండర్ల పథకం అమలు
– మహిళలకు త్వరలోఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
– రాబోయే ఐదు సంవత్సరాలలో రాయచోటి నియోజకవర్గం రూపురేఖలు మారుస్తాం
– రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి: పేదల సంక్షేమమే తమ కర్తవ్యంగా అర్హులందరికీ పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

ఆదివారం రాయచోటి మండల పరిధిలోని సిబ్యాల గ్రామంలో “ఇది మంచి ప్రభుత్వం” ప్రజా దర్బార్ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ….. గతంలో ఎవరు చేయని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల నుంచి ఇది మంచి ప్రభుత్వం అని ఒక గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు.

రాబోయే రోజులలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలలో భాగంగా వచ్చే దీపావళికి అర్హులైన ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు.

మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి త్వరలో విధి విధానాలు రూపొందించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో కల్పించడం జరుగుతుందన్నారు.

LEAVE A RESPONSE