Suryaa.co.in

Andhra Pradesh

ఇరవయ్యేళ్ల సర్వీసున్న జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి

– సెక్రటేరియట్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు రాజా రమేష్
– సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన రాజా రమేష్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ప్రశంసనీయం.మూడు సెంట్లకు బదులు కనీసం ఆరు సెంట్ల స్థలాన్ని కేటాయించేలా జీవోను సవరించాలి.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జర్నలిస్టులకు ఆరు సెంట్లు కేటాయిస్తూ జీవో ఇచ్చారని గుర్తు చేసిన రమేష్.

గవర్నమెంట్ రేటు ప్రకారం ఆరు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసుకోగల జర్నలిస్టులకు అవకాశం ఇవ్వాలి.స్టేట్ అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఏపీ సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలకు దగ్గరగా విజయవాడ, మంగళగిరి మధ్య స్థలాలు కేటాయించాలి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లలో దరఖాస్తు చేసుకున్న స్టేట్ జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.

విజయవాడ ఆఫ్షన్ పెట్టకున్న జర్నలిస్టులకు వైజాగ్ కు మార్చుకునేందుకు అవకాశమివ్వాలి.చాలా కాలంగా అక్రిడిటేషన్ కార్డు ఉన్నప్పటికీ ఈ ఏడాది అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులు అర్హులు కాదనడం సరికాదు.అనుభవమున్న జర్నలిస్టులకు పేపర్ క్లిప్పింగ్స్ తో ముడిపెట్టకుండా ఫ్రీలాన్సర్ గా అక్రిడిటేషన్ మంజూరు చేయాలి.కనీసం ఐదేళ్ల నుండి పదేళ్ల అక్రిడిటేషన్ గల జర్నలిస్టులందరికీ స్థలాలు కేటాయించేలా జీవోను సవరించాలి.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ఎంతో చొరవతీసుకుని సహకరిస్తున్న సమాచార శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డికి అభినందనలు.త్వరిత గతిన భూసేకరణ చేపట్టి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని వినతి.వేగవంతం చేయాలని సమాచార శాఖ కమిషనర్ మరింత చొరవతీసుకోవాలని కోరుతున్నాం.

LEAVE A RESPONSE