Suryaa.co.in

Andhra Pradesh

డ్రగ్స్ మహమ్మారి పై ప్రభుత్వం కఠిన చర్యలు

– హోం మంత్రి సారధ్యంలో చెండాడుతున్న ఈగల్ టీం
-నిరుద్యోగంతో డ్రగ్స్ అలవాటు
-గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
-ఆలోచన కలిగిస్తున్న డార్క్ డీల్స్ సినిమా
– కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

విజయవాడ: డ్రగ్స్ మహమ్మారిపై మా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రి అనిత సారధ్యంలో ఈగల్ టీం ఈ విషయంలో చెండాడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ పూర్తిగా విస్మరించిందని, పిల్లవాడిని కూడా డ్రగ్స్ కు అలవాటు చేసిందని మండిపడ్డారు. గురువారం విజయవాడలో సమీరా ఫిలిమ్స్ నిర్మించిన డార్క్ డీల్స్ చిత్రం ట్రైలర్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు.

చిత్ర నిర్మాత కసునూరి మౌలాలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. డ్రగ్స్ ని నియంత్రించడంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందని , జగన్మోహన్ రెడ్డి పూర్తి విఫలమయ్యాడని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారంలో పూర్తిగా విఫలమైందనీ, ఫలితంగా నిరుద్యోగులు చీడ అలవాట్లకు బానిసలుగా మారారని, మత్తు మార్గాలు చూస్తున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలోమా ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో హోంమంత్రి అనిత డ్రగ్స్ పై నిరంతరం పోరాడుతున్నారని ఆమె నేతృత్వంలో పోలీస్ శాఖ ఈగల్ అనే టీం ఏర్పాటు చేసి ఏ మూలాన డ్రగ్స్ ఉన్న పట్టుకునే విధంగా చర్యలు చేపడుతున్నారని చెబుతూ.. ఆమె పనితీరు అమోఘమని మంత్రి కొనియాడారు. డార్క్ డీల్స్ వంటి సినిమాలు వల్ల యువత లో చైతన్యం పెరిగి డ్రగ్స్ బారిన పడకుండా ఉంటారని, ఈ చిత్రం యువతలో ఆలోచనకు దారి తీసే విధంగా ఉందని చెప్పారు.

యువతలో చైతన్యం స్ఫూర్తి కలిగించే ఇలాంటి సినిమాలు రానున్న రోజుల్లో ఎన్నో రావాలని కోరుతూ ఈ చిత్రం నిర్మించిన చిత్ర యూనిట్ ని మంత్రి వాసంశెట్టి అభినందించారు. అలాగే నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చెడు దారిలో నడుస్తున్న యువతను సక్రమంగా తమ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇందుకుగాను ఉపాధి శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించి ఎక్కడికి అక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత కసునూరి మౌలాలి మాట్లాడుతూ యువత ఎంతోమంది మత్తుకి బానిస అవుతున్నారన్నారు. యువతి యువకులు వాళ్ళ జీవితాలను ఈ డ్రగ్స్ వల్ల నాశనం చేసుకుంటున్నారని, అలాంటి వారిలో ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలిపారు.

మంత్రి ఎంతో బిజీగా ఉన్నా కూడా మా కోసం సమయాన్ని కేటాయించి ట్రైలర్ విడుదల చేసినందుకు డార్క్ డిల్ స్టీమ్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కిరణ్ మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎంతో ఓపికతో మా ట్రైలర్ ని వీక్షించి చాలా బాగుందని మెచ్చుకున్నారన్నారు. మా టీం కి సమయం కేటాయించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తేజస్విని, ఆశ ,ఉమా, ఏడుకొండలు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE