Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా రాజధాని అమరావతిలో ప్రభుత్వ దొంగలు

• రాజధానిలో నిర్మాణసామగ్రి.. యంత్రసామగ్రి.. ఇతర విలువైన పరికరాలు.. పైపులు.. అధికారపార్టీ వారే దొంగిలిస్తుంటే, ముఖ్యమంత్రి పోలీస్ వ్యవస్థ చోద్యం చూస్తున్నాయి
• అధికారంలోకి రాకముందు అమరావతిపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోసిన జగన్.. పదవి రాగానే రైతుల్ని నట్టేట్ట ముంచాడు, వారికి కౌళ్లు కూడా చెల్లించకుండా కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడు
• 1420 రోజులకు పైగా అమరావతి కోసం ఉద్యమిస్తున్న మహిళలు రైతుల ముఖం కూడా చూడటానికి ఈ ముఖ్యమంత్రికి మనసు రాలేదు
• జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం అమరావతిపై ఎన్నికుట్రలు..కుతంత్రాలు పన్నినా అంతిమంగా న్యాయం, ధర్మాన్ని నమ్ముకున్న రాజధాని రైతులే గెలుస్తారు
– తెలుగు మహిళా నేత పాలడుగు వినీల

ప్రజారాజధానిలో ప్రభుత్వదొంగలు పడ్డారని.. గతప్రభుత్వం రాజధానిలో నిర్మించిన నిర్మాణాలను విధ్వంసంచేసి.. మొత్తంగా అమరావతిని వైసీపీప్రభుత్వం నాశనం చేస్తే.. అధికారపార్టీ అండతో కొందరు దొంగలు అక్కడి ఇసుక, కంకర ఇతర నిర్మాణ సామగ్రి.. యంత్రసామగ్రి..వస్తువులను దోచేస్తున్నారని, ఆఖరికి డ్రైనేజ్ వ్యవస్థకోసం వేసిన పైపులు, తాగునీటి పైపుల్ని కూడా దొంగిలిస్తుంటే, ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం సిగ్గుచేటని తెలుగుమహిళా నేత పాలడుగు వినీల ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడి న వివరాలు, ఆమె మాటల్లోనే ….

“ రాజధానిలో జరిగే దొంగతనాలు.. వాటికి పాల్పడుతున్న దొంగలని యథేచ్ఛగా వదిలేసిన పోలీస్ శాఖ.. రాజధాని మహిళలు, రైతులపై మాత్రం పనిగట్టుకొని మరీ తప్పుడు కేసులు పెడుతోంది. రాజధానిలో ఉంటున్న ముఖ్యమంత్రికి.. డీజీపీకి అక్కడ జరుగుతున్న దొంగతనాల గురించి తెలియదా? మాయమవుతున్న నిర్మాణసామగ్రి, ఇతర పరికరాలు, యంత్రాలు కనిపించడం లేదా?

అధికారంలోకి రాకముందు అమరావతిపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోసిన జగన్.. పదవి రాగానే రాజధాని రైతుల్ని నట్టేట్ట ముంచాడు
అధికారంలోకి రాకముందు రాజధాని అమరావతి ఎక్కడికీపోదని.. ఆప్రాంత ప్రజల్ని మభ్యపెట్టి, అసైన్డ్ భూముల రైతులకుకూడా ఇతర రైతులకు ఇచ్చినట్టే సమాన ప్యాకే జీ ఇస్తానని, రైతుకూలీలకు నెలకు రూ.5వేలు ఇస్తానని మాయమాటలు చెప్పిన జగన్ అధికారంలోరి రాగానే తన నిజస్వరూపం బయటపెట్టుకున్నాడు. రాజధాని రైతుల్ని నమ్మించి వారి గొంతుకోశాడు. రాజధానిని నాశనంచేసి.. తనలోని విధ్వంసకుడిని సంతృప్తిపరుచుకున్న ముఖ్యమంత్రి.. దాదాపు 1420రోజులకు పైగా రాజధానికోసం రైతులు, మహిళలలు ఉద్యమాలు చేస్తుంటే, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు. ఇన్నేళ్లుగా రైతులు ఎందుకు రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు.. వారి సమస్యమిటనే కనీస ఆలోచన కూడా ఈ ముఖ్యమంత్రికి రాకపోవడం నిజంగా బాధాకరం. చివరకు జగన్ నాలుగున్నరేళ్ల పాలనతో రాష్ట్రం రాజధాని లేని అనామక రాష్ట్రంగా దేశంలో నిలిచింది.

అమరావతి నిర్మించలేకే జగన్ అండ్ కో పూటకో రకంగా రాజధానిపై దుష్ప్రచారం చేశారు
అమరావతి నిర్మాణం చేతగాక.. టీడీపీప్రభుత్వంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. ఆ పార్టీనేతలు భూములు అమ్ముకున్నారని.. రాజధాని నిర్మాణం చాలా ఖర్చుతో కూడిందని రకరకాల కుంటిసాకులు చెప్పి నాలుగేళ్ల పాటు జగన్ అతని పరివారం కాలయాపన చేసింది. అధికారంలోకి రాకముందు… అమరావతిని కొనియా డి.. దాని నిర్మాణాన్ని కొనసాగిస్తామని చెప్పిన జగన్.. అతని పార్టీ నేతలు పదవులు దక్కగానే నాలుక మడతేశారు.

స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారామ్ ఇంగితం లేకుండా రాజధానిని ఎడారితో పోలిస్తే.. కొందరు మంత్రులు శ్మశానమని..పందులు తిరుగుతున్నాయని, నిర్మాణాలు లేవని ఇష్టానుసారం నోరుపారేసుకున్నారు. అమరా వతి నివాసానికి అనుకూలమైంది కాదని చెప్పిన ఈ మంత్రులు.. ముఖ్యమంత్రే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోని వారికి అక్కడ ఇళ్లస్థలాలు ఎందుకు కేటాయించారో చెప్పాలి. చంద్రబాబునాయుడి ప్రభుత్వం నిర్మించిన నిర్మాణాలను గ్రాఫిక్స్ అని ఎద్దేవా చేసిన వారు నేడు ఎక్కడ తలదాచుకుంటున్నారో..పోలీసుల్ని అడ్డుపెట్టుకొని ఎక్కడ భయభయంగా బతుకుతున్నారో ఆలోచించుకోవాలి.

 ఆ మరణాలన్నీ ముమ్మా టికీ ప్రభుత్వ హత్యలే
ప్రజారాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేయాలన్న దురుద్దేశంతో జగన్ రెడ్డి అతని ప్రభుత్వం మూడురాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి.. రాజధానికి భూములిచ్చిన దాదాపు 223మంది రైతుల్ని అన్యాయంగా బలితీసుకుంది. ఆ మరణాలన్నీ ముమ్మా టికీ ప్రభుత్వహత్యలే. రైతులకు ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ప్లాట్లు..ఆర్థికసహాయం తక్షణమే చెల్లించాలని హైకోర్టు 2022 మార్చిలో తీర్పుఇస్తే.. రైతులకు సాయం చేయడం ఇష్టలేని ముఖ్యమంత్రి ఆ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాడు. చంద్రబాబు రైతుల త్యాగాలను గౌరవించి.. వారికి చేయాల్సినంత సాయం చేస్తే.. .జగన్ వారిని రోడ్లపాలు చేసి, పోలీసులతో వారిని కొట్టిస్తూ ఆనందిస్తున్నాడు.

నా ఎస్సీలు ..నా ఎస్టీలు అనే ముఖ్యమంత్రి దళితరాజధాని అమరావతిని నాశనం చేశాడు. గతప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అమరావతి నిర్మాణం జరిగుంటే దాదాపు రాష్ట్రంలో 5 లక్షల మందికి ఉపాధి ఉద్యోగాలు లభించేవి. చంద్రబాబునాయుడు హాయాంలో 130 కేంద్రసంస్థలు…ఇతర ప్రముఖ సంస్థలకు అమరావతిలో భూములు కేటాయించడం జరి గింది. జగన్ రెడ్డి వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకోవడంతో చివరకు ప్రముఖ సంస్థలన్నీ రాష్ట్రానికి గుడ్ బై చెప్పాయి. జగన్మోహన్ రెడ్డి కావాలనే కక్షతో అమరావతి రైతుల్ని వేధిస్తున్నాడు..వారికి నెలానెలా ఇవ్వాల్సిన కౌలు సాయం ఇవ్వడంలేదు.

రాజధాని అమరావతిపై జగన్ రెడ్డి..అతని ప్రభుత్వం ఎన్నికుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా అంతిమంగా గెలిచేది అమరావతి రైతులే
టీడీపీప్రభుత్వం అమరావతిలో ఆర్-3 జోన్ పేరుతో పేదలఇళ్లస్థలాల కోసం కేటాయించిన భూముల్ని కాదని.. పారిశ్రామిక అవసరాలకోసం కేటాయించిన ఆర్-5 జోన్లో ఎక్కడో రాజధానికి దూరంగా ఉండేవారికి స్థలాలు ఇవ్వడం ఈ ముఖ్యమంత్రి విధ్వంసపు ఆలోచనల్లో భాగమే. పేదలకు సెంటుపట్టాలు ఇచ్చి.. ఏదో వారిని ఉద్ధరించినట్టు మాట్లాడుతున్న జగన్ రెడ్డి మాత్రం విశాఖపట్నంలో రుషికొండపై భారీ భవంతి నిర్మించుకుంటున్నాడు. జగన్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉండి.. వారికి రాజ ధానిలో నివాస సౌకర్యం కల్పించాలనే ఆలోచనే ఉంటే..నివాస ప్రాంతాలకు కేటాయించి న భూముల్లో అన్నిహంగులతో వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. అలానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇళ్లులేని పేదలకు ఒక్కోకుటుంబానికి 3సెంట్ల స్థలం కేటాయించాలి.

టీడీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో భాగంగా మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచిన నవనగరాల నిర్మాణం పూర్తై ఉంటే.. రాష్ట్ర రూపురేఖలు దేశమే అవాక్కయ్యేలా మారిపోయేవి. జగన్ కు కూల్చడం తప్ప..నిర్మాణం చేతగాదని అతను అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే అర్థమైంది. న్యాయం.. ధర్మరం అమరావతి రైతుల పక్షాన ఉన్నాయి కాబట్టే న్యాయస్థానాలు కూడా వారి పక్షాన నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎన్నికుట్రలు చేసినా.. వైసీపీప్రభు త్వం ఎన్ని కుతంత్రాలు పన్నినా భవిష్యత్ లో సుప్రీంకోర్టు కూడా అమరావతే రాష్ట్ర రాజధాని అని ప్రకటించడం ఖాయం. అమరావతి మహిళలు 1400మందిపై తప్పుడు కేసులు పెట్టిన ఈ ప్రభుత్వం.. పోలీస్ వ్యవస్థ రాజధానిని దోచుకుంటున్న ప్రజాప్రతిని ధులు..వైసీపీవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానంచెప్పాలి.” అని వినీల డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE