Suryaa.co.in

Andhra Pradesh

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

బెస్తవారిపేట గ్రామ సభలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సభలలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలోని బెస్తవారిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోన్నారు.

ఈ సందర్బంగా  మాట్లాడుతూ… ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ప్రతీ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తుందని గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి రూ.15 కోట్లు మంజూరు చేయటం జరిగిందని, గ్రామాలను అన్నీ రంగాలలో ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  కంకణం కట్టుకున్నారని గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తే, గ్రామాలను అభివృద్ధి చేస్తేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని ఎన్డీయే ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు.

బేస్తవారిపేట పంచాయతీలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యేకి తెలియచేయగా వాటిని వెంటనే పరిష్కారం చేయాలని, అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బెస్తవారిపేట పంచాయతీ గ్రామ సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, మండల అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజలు పాల్గోన్నారు.

LEAVE A RESPONSE