Suryaa.co.in

Andhra Pradesh

చెరకు రైతుల పట్ల ప్రభుత్వ తీరు దారుణం:లోకేష్‌

చెరకు రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణంగా ఉందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న ఎన్సీఎస్, నిన్న తాండ‌వ ఫ్యాక్టరీ దగ్గర చెరకు రైతులను పోలీసులు చావగొట్టారు. చెర‌కు బిల్లులు చెల్లించాల‌ని ఆందోళన చేస్తున్న రైతులపై దాడులు, అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. విశాఖ పాయకరావుపేటలోని తాండవ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర.. కౌలు రైతుని సర్కారు మూర్ఖత్వమే బలితీసుకుందన్నారు. పోలీసుల క్రూర‌త్వంతో కౌలు రైతు నానాజీ మృతి చెందారన్నారు. కౌలు రైతు నానాజీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెరకు రైతుల బిల్లులు త‌క్షణమే చెల్లించాలన్నారు. రైతుల స‌మస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోకేష్‌ కోరారు.

LEAVE A RESPONSE