Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం

– ప్రకాశం బ్యారేజీ నుండి రికార్డు స్థాయిలో నేడు 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీటి విడుదల

1852-55 మధ్య కాలంలో సర్ ఆర్థర్ కాటన్ నేతృత్వంలో కృష్ణా నదిపై నిర్మించిన ప్రప్రథమ ప్రాజెక్టు విజయవాడ ఆనకట్ట. 1903లో అత్యధికంగా 10.61 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారట. దాన్ని గమనంలో ఉంచుకొని 1952 -58లో పునర్నిర్మాణం చేసినప్పుడు గరిష్టంగా 11.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి విడుదలకు వీలుగా ప్రకాశం బ్యారేజీని డిజైన్ చేశారు.

2009 అక్టోబరు వరదల సమయంలో గరిష్టంగా 10.90 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. నేడు 11.43 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసినట్లు అధికారికంగా వెల్లడించారు. పులిచింతల నుండి 5,43,617 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మున్నేరు నుండి 1,86,962 క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలో చేరుతున్నదని ప్రభుత్వ వెబ్సైట్ లో పేర్కొన్నారు. ఈ గణాంకాలను బట్టి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినట్లే. ప్రకాశం బ్యారేజీపై ఒత్తిడి తగ్గుతుంది.

కృష్ణా నది మరీ ప్రధానంగా విజయవాడలోని బుడమేరు వరద బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం.

– టి. లక్ష్మీనారాయణ,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

LEAVE A RESPONSE