Suryaa.co.in

Andhra Pradesh

బాబు భద్రతపై సర్కారు దృష్టి

– 1.44 కోట్లు కేటాయింపు

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీలోని చంద్రబాబు నివాసం దగ్గర భద్రత, ఇతర వసతుల కోసం నిధుల విడుదలకు జీవో జారీ అయింది.

రూ.1.44కోట్లను ప్రభుత్వం కేటాయించింది. . రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు రూ.21లక్షలు, నిఘా కోసం రూ.81లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. సీఎం ఇంటికి వచ్చే వాహనాల తనిఖీలు, నియంత్రణ, యూవీఎస్‌ఎస్, హైడ్రాలిక్ బోలార్డ్స్ కోసం రూ.42లక్షలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. చంద్రబాబునాయుడు దక్షిణ భారతదేశంలోనే అత్యంత భద్రత ఉన్న ఏకైక నాయకుడు కావడం గమనార్హం.

LEAVE A RESPONSE