హైదరాబాద్:: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రూపొందించిన 2026 సంవత్సరం మీడియా డైరీని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గురువారం హైదరాబాద్ లోని లోక్ భవన్(రాజ్ భవన్)లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య ఫెడరేషన్ సంఘం గురించి, మీడియా డైరీ గురించి గవర్నర్ కు వివరించారు. మీడియా డైరీని పరిశీలించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ, సమగ్ర సమాచారంతో రూపొందించిన ఈ మీడియా ప్రతి ఒక్కరికి ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. మీడియా డైరీ రూపొందించి ఫెడరేషన్ ప్రతినిధులను గవర్నర్ అభినందించారు.
అంతకుముందు కార్యక్రమంలో పాల్గొన్న మామిడి సోమయ్యతో పాటు ఫెడరేషన్ రాష్ట్ర కో-కన్వీనర్లు పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, బండి విజయ్ కుమార్, తన్నీరు శ్రీనివాస్, కుడితాడు బాపురావు, నాయకులు పద్మనాభరావు, జె.ఉదయభాస్కర్ రెడ్డి, గోపాల్ తదితరులు గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షు తెలిపారు.
అనంతరం సచివాలయంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ కమీషనర్ సీహెచ్ ప్రియాంక లు టీ డబ్ల్యూ జేఎఫ్ మీడియా డైరీని వేర్వేరుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రికి, స్పెషల్ కమిషనర్ లకు పూల బొకే ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.