– విగ్రహం వద్ద కిషన్రెడ్డి, ఈటల, రామచందర్రావు నివాళులు
కంటోన్మెంట్. పార్క్, సికింద్రాబాద్లో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జీ విగ్రహానికి ప్రముఖులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అటల్ జీ జీవితం రాజనీతిజ్ఞత, ప్రజాస్వామ్య విలువలు, కవిత్వం, అచంచలమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచింది. ఆయన వారసత్వం తరతరాల భారతీయులకు నిరంతరం ప్రేరణనిస్తూనే ఉంది అని ప్రముఖులు అన్నారు.
ఈ కార్యక్రమంలో గవర్నర్ విష్ణు దేవ్ వర్మ జీ, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల్ రాజేందర్, MLC కొమరయ్య జిల్లా నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యాలయ పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.