Suryaa.co.in

Andhra Pradesh

సంపూర్ణ ఆరోగ్యంతో విజయవాడ చేరుకోనున్న గవర్నర్

కరొనా నుండి పూర్తిగా కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం మధ్యాహ్నం విజయవాడ చేరుకోనున్నారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. డిల్లీ పర్యటన తదుపరి కరోనా లక్షణాలు బయట పడటంతో ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో గవర్నర్ జాయిన్ అయ్యారు. మెరుగైన చికిత్సతో వేగంగా కోలుకున్న గవర్నర్ మంగళవారం ఉదయం 12గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఒంటిగంటకు విజయవాడ – గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుంటారు. షేడ్యూలును అనుసరించి 1.30 గంటలకు రాజ్ భవన్ వస్తారని సిసోడియా పేర్కొన్నారు.

LEAVE A RESPONSE