-పింఛన్ల పేరుతో తప్పుడు సమాచారంతో పత్రికల్లో ప్రకటనలిచ్చిన సమాచారశాఖ కమిషనర్ కోర్టులో దోషిగా నిలబడకతప్పదు
– పింఛన్ల చెల్లింపుని ప్రహాసనంగా మార్చి, దాన్నిరాజకీయంగా వాడుకుంటున్న జగన్ రెడ్డినిచూస్తుంటే, అసహ్యం జుగుప్సా కలుగుతున్నాయి
– మంత్రి బూడి ముత్యాలనాయుడిపేరుతో, ప్రభుత్వం తప్పుడు సమాచారంతో అవ్వాతాతల్ని, వికలాంగులు, వితంతువుల్ని మోసగించడం నీచాతినీచం.
• పింఛన్ల చెల్లింపులో జగన్మోహన్ రెడ్డి అవ్వాతాతలకు పంగనామాలుపెట్టాడు.
• పింఛన్ల పేరుతో పత్రికల్లో నేడు ప్రభుత్వం తప్పుడుసమాచారం ఇచ్చింది.
• సమాచారశాఖకమిషనర్ పేరుతో నేడుపత్రికల్లో వచ్చిన తప్పుడుసమాచారంపై ఆయనే స్పందించాలి.
• జగన్మోహన్ రెడ్డి పదిజన్మలెత్తినా చంద్రబాబు ఇచ్చినంతమందికి, ఆయనఇచ్చినంత మొత్తం పింఛన్ ఇవ్వలేడు.
• వాలంటీర్లకు దోచిపెట్టే రూ.1600కోట్ల సొమ్ముని జగన్ రెడ్డి పింఛన్ దారులకే ఇవ్వొచ్చుకదా!
• చంద్రబాబు పింఛన్ల సొమ్ముని ఏకంగా రూ.1800వరకు పెంచితే, జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి రూ.625లుపెంచేసరికి అల్లాడిపోయారు.
– మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్
అధికారంలోకి రాకముందు అవ్వాతాతలకు రూ.3వేల పింఛన్ ఇస్తానని మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రయ్యాక మూడేళ్లనుంచి కేవలం రూ.2,500లు మాత్రమే ఇస్తూ, వృద్ధులు, మహిళలు, వితంతువులు, దివ్యాంగుల ఉసురుపోసుకుంటున్నాడని, పింఛన్ల పంపిణీని దేశంలోఎక్కడాలేని విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రహాసనంగా మార్చిందని, పింఛన్లలో తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తున్నవారిని వాలంటీర్లతో బెదిరించడం కంటే నీతి మాలిన, హేయమైనచర్య ఏముంటుందో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనరవికుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జగన్ రెడ్డి ప్రజలసొమ్ము అంటే తనతాత సొత్తుగా భావిస్తున్నాడు. పింఛన్లపేరుతో నేడు ప్రభుత్వం ఇచ్చినప్రకటనలు, వాటిలోని రాతలుచూస్తే జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన అసహ్యం , జుగుప్సా కలుగుతున్నాయి. ప్రతి అంశాన్ని తనరాజకీయానికి వాడుకుంటూ, ప్రతిపక్షంపై బురదజల్లడం జగన్ రెడ్డి లాంటి మూర్ఖుడికే సాధ్యమైంది. నిజంగా జగన్మోహన్ రెడ్డికి దమ్ము, ధైర్యంఉంటే, తనప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై ప్రతిపక్షంతో ప్రజలమధ్యనే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేస్తున్నాం.
ప్రజల సొమ్ముతో పత్రికల్లో తప్పుడుసమా చారం ప్రచురించే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? ఈనెల పింఛన్ల పంపిణీలో జరిగి జాప్యం గురించి ముఖ్యమంత్రికి తెలియదా? ప్రతినెలా ఒకటోతేదీనే ఇళ్లముందుకు వెళ్లి, ప్రజలకు గుడ్ మార్నింగ్ చెప్పి మరీ పింఛన్లు పంపిణీచేస్తున్నామని డబ్బాలుకొట్టుకుంటు న్నారు కదా..! మరి ఈనెలలో అలాఎందుక ఇవ్వలేకపోయారు? అర్హులైన వారికి పింఛన్లు తొలగించినమాట వాస్తవంకాదా? ఉపాధికోసం ఇతరప్రాంతాలకు వెళ్లినవారి పింఛన్లు స్థానికతపేరుతో మీప్రభుత్వం తొలగించలేదా? టీడీపీ సానుభూతిపరులని, వాలంటీర్లకు లంచం ఇవ్వలేదని రాష్ట్రవ్యాప్తంగా లక్షలపింఛన్లు తొలగించింది మీరుకాదా జగన్ రెడ్డీ?
ఇంటి అద్దెలు ఎక్కువ కట్టినా, కరెంట్ బిల్లుఎక్కువ వచ్చినా, నాలుగుచక్రాల వాహనాలు ఉన్నాయని (ఆఖరికి ట్రాక్టర్ ని నాలుగుచక్రాల వాహనంకింద లెక్కేశారు), రూ.20వేలు, అంతకంటే ఎక్కువ జీతం తీసుకునేవారు ఇంటిలోఉన్నారని, రేషన్ కార్డుకి ఆధార్ నంబర్ లింక్ కాలేదని, ఇలా పిచ్చిపిచ్చికారణాలతో మీకు, మీ వాలంటీర్లకుతోచినట్టు అర్హులైన వారికి పింఛన్ తొలగించారా..లేదా?
పింఛన్లచెల్లింపులో ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. కొత్త మంత్రి బూడి ముత్యాలనాయుడిపేరుతో నేడుపత్రికల్లో తప్పుడు సమాచారంతో ఇచ్చిన ప్రకటనలపై రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ సమాధానంచెప్పాలి. సమాచారశాఖ పేరుతో నేడుప్రభుత్వం పత్రిక లకు ఇచ్చిన సమాచారం లోని వాస్తవమెంతో కూడా కమిషనర్ చెప్పాలి. లేకుంటే ఆయన్నికోర్టులో దోషిగానిలబెట్టి, అసలుసమాచారాన్ని,ప్రభుత్వం ముఖ్యమంత్రి చెబుతున్న అబద్ధాలను బహిర్గతం చేస్తాం.
తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడానికి, తప్పుడు వార్తలను ప్రసారం చేయడానికి రాష్ట్ర సమాచార శాఖ లేదని సదరుశాఖ కమిషనర్ తెలుసుకో వాలి. లేకుంటే ఆయన తగిన మూల్యంచెల్లించుకుంటాడని హెచ్చరిస్తున్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, పింఛన్లచెల్లింపుపై వైసీపీ ప్రభుత్వం ప్రజల్నితప్పుదారి పట్టిస్తోంది అనడానికి నేడుపత్రికల్లో వచ్చిన ప్రభుత్వప్రకటనలే నిదర్శనం.
తప్పుడుసమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించడానికి ప్రయత్నించిన సమాచారశాఖ కమిషనర్ పై క్రిమినల్ కేసులు నమోదుచేయిస్తాం. ఆయన కచ్చితంగా న్యాయస్థానంలో దోషిగా నిలబడే తీరతారు.
పింఛన్ల పెంపు, చెల్లింపు గురించి జగన్ రెడ్డికి వాస్తవాలు తెలుసా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలుత పేదలకు పింఛన్లచెల్లింపు ప్రారంభించింది స్వర్గీయ నందమూ రి తారకరామారావుగారు. ఆయన హాయాంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.30లతో తొలిసారి పింఛన్ల పంపిణీ మొదలైంది. తరువాత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిఅయ్యాక దాన్నిరూ. 200లకు, తరువాత ఏకంగా 2018లో రూ.2వేలకు పెంచారు. రాజశేఖర్ రెడ్డిగానీ, ఇతర కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగానీ, పదేళ్లుఉమ్మడిరాష్ట్రంలో అధికారంలోఉండికూడా రూ.75 నుంచిరూ.125కు మాత్రమే పింఛన్ సొమ్ము పెంచారు.
చంద్రబాబుహాయాంలో రాష్ట్రవ్యాప్తంగా 54లక్ష ల20వేలమందికి అందచేయడం జరిగింది. గతంలో టీడీపీ ప్రభుత్వం పింఛన్ సంఖ్యను అంతకుముందు ఉన్న దానికంటే రెండు,మూడురెట్లు పెంచితే, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పింఛన్లలో కోత పెట్టాడు. అర్హులైన వారికి పంగనామాలుపెట్టి, తనపార్టీవారికి, తనవర్గంవారికే అధికంగా పింఛన్లు ఇచ్చాడు. జగన్ రెడ్డి జమానాలో ఒకేఇంటిలో ఇద్దరు, ముగ్గురికి కూడా పింఛన్లు వస్తుంటే, కొన్నిప్రాంతాల్లో రెండు,మూడుఇళ్లలోకలిపి ఒక్కరికీ రావడంలేదు.
టీడీపీ ప్రభుత్వం ప్రతినెలా రూ.1200కోట్లవరకు పింఛన్లరూపంలో పంపిణీచేస్తే, జగన్మోహన్ రెడ్డి సర్కారు రూ.400కోట్లే ఇచ్చారని ఎలా, ఏఆధారాలతో చెబుతోంది?
చంద్రబాబునాయుడుగారు కేవలంఐదేళ్లలో రూ.1800వరకు పింఛన్ పెంచారు. అలా అంత మొత్తం పెంచాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సుచేయాలి. పదిజన్మలు ఎత్తినాకూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినంతమొత్తంగానీ, ఇచ్చినంతమందికిగానీ పింఛన్ ఇవ్వలేడని బల్లగుద్దిచెప్పగలం. పింఛన్లసొమ్ము రూ.3వేలకుపెంచుతానని ప్రగల్భాలుపలికిన జగన్ రెడ్డి, ఆపనిచేయలేక చివరకు వయోపరిమితి తగ్గించి ఎక్కువమందికి ఇస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నాడు.
పొరుగురాష్ట్రమైన తెలంగాణలో వృద్ధాప్యపింఛన్ అర్హతవయస్సుని 57ఏళ్లకే పరిమితంచేశారు.అలానే రాష్ట్రంలోకూడా జగన్మో హన్ రెడ్డి పింఛన్ పొందేవారి వయసు తగ్గించగలడా? జగన్ రెడ్డి వచ్చాకే ప్రతినెలా 1వతేదీని పింఛన్ ఇస్తున్నారా.. టీడీపీ హయాంలో ఇవ్వలేదా? ఆనాడు ప్రతినెలా 1వతేదీనుంచి 10వ తేదీ వరకు పింఛన్లు అందించాము. జగన్ రెడ్డి పింఛన్ సొమ్ము పెంచి, అవ్వాతాతలకు న్యాయంచేయకుండా, వాలంటీర్లకు న్యాయంచేశాడు. వాలంటీర్ వ్యవస్థపేరుతో ప్రతినెలా ఈ ముఖ్యమంత్రి రూ.1600కోట్ల ప్రజల సొమ్ముని దుబారా చేస్తున్నాడు.
అదే సొమ్ముని పింఛన్ దారులకు ఇస్తే, మరింతమందికి న్యాయంజరుగుతుంది కదా! వాలంటీర్ల పేరుతో తనపార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి ప్రజలసొమ్ముని దోచిపెడుతు న్నాడు అనేది వాస్తవం. ఈనెలలో పండుగల సెలవులుఉన్నాయని, అందుకే సకాలంలో పింఛన్ ఇవ్వలేకపోయామనిప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు. పండుగల సెలవులు వస్తాయని ప్రభుత్వానికి ముందుతెలియదా? పింఛన్లు చెల్లించే తేదీల్లో సెలవులు వస్తే, చంద్రబాబుగారు ముందునెలలోనే పింఛన్లు చెల్లించారు తప్ప,… జగన్ రెడ్డిలా కల్లబొల్లికబుర్లు చెప్పలేదు.
మాట తప్పడం లో, మడమతిప్పడంలో జగన్ రెడ్డి బొంగరంలా తిరుగుతున్నాడు. అవ్వాతాత లకు అరచేతిలో వైకుంఠంచూపుతున్న జగన్ రెడ్డి, ఏకంగా అభయహస్తం కింద మహిళలు దాచుకున్నపొదుపుసొమ్ముని కూడా మింగేయడానికి సిద్ధమయ్యాడు. ఆ విధంగా జగన్ రెడ్డి రూ.2,100కోట్లవరకు కాజేయలేదా? అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ప్రతిపక్షాన్ని నిందించడం… ప్రశ్నించే ప్రసార మాధ్యమాలను దూషించడమే జగన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యమంత్రి అసమర్థతను ఎత్తిచూపే మీడియా పచ్చ మీడియా అయితే, జగన్మోహన్ రెడ్డిని సమర్థించేది పిచ్చి మీడియా? పిచ్చి మీడియాను అడ్డం పెట్టుకొని ప్రజల్ని నమ్మించాలని చూస్తున్న ముఖ్యమంత్రి ఆటలు ఎల్లకాలంసాగవు. వాస్తవాలను ప్రజలకు చెప్పలేని వైసీపీప్రభుత్వాన్ని, సదరు ప్రభుత్వంలోని సమాచార శాఖను చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. ఎవరైనా ఏమైనా అంటే ముఖ్యమంత్రి నా బొచ్చు కూడా పీకలేరంటూ కొత్త రాగం ఆలపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి తమకు చేసిన మోసానికి, ప్రతిఫలంగా రాబోయే రోజుల్లో ఆయన్ని అవ్వాతాతలు, వితంతవులు వారివెంట్రుకలనే తాళ్లుగాపేని, తాటతీయడం ఖాయ మని హెచ్చరిస్తున్నాను.