– ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని కలిసిన శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య , మాజీ ఎమ్మెల్సీ టి.డి జనార్దన్
వెంటనే స్పందించి ఎన్టీఆర్ జిల కలెక్టర్కు ఫోన్
అమరావతి : జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం, పోలంపల్లి గ్రామ పరిధిలో సాగునీరు సరఫరా నిమిత్తం మునేరు పై సుమారు 100 సంవత్సరాలు క్రితం నిర్వహించబడిన పోలంపల్లి డ్యాం మరమ్మత్తుల నిమిత్తం నిధులు మంజూరు కొరకు ఈరోజు జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, మాజీ ఎమ్మెల్సీ టి.డి జనార్దన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వినతి పత్రం ఇచ్చారు. మునేరు డ్యాం తాత్కాలిక మరమ్మత్తులకు నిధులు మంజూరు చేసి, ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కి ఖమ్మం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు చేశారు.