-జీఎస్టీ సొమ్ములే సొమ్ములు!
కేంద్ర ఖజానాకు జీఎస్టీ కిక్కెంది. జీఎస్టీ ఆదాయంతో కేంద్ర ఖజానా కళకళ లాడుతోంది. దేశంలో జీఎస్టీ వసూళ్ల జోరు కొసాగుతోంది . 2022 మే నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం రూ . 1,40,885 కోట్లుగా నమోదు అయ్యింది . ప్రభుత్వ గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి . మే నెలలో జీఎస్టీ కలెక్షన్లు వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏకంగా 44 శాతం మేర పెరిగాయి . గత ఏడాది ఇదే నెలలో జీఎస్టా కలెక్షన్లు రూ.97,821 కోట్లుగా నమోదు అయ్యాయి . అయితే నెలవారీగా చూస్తే మాత్రం జీఎస్జీ వసూళ్లలో తగ్గుదల నమోదు అయ్యింది . జీఎస్టీ కలెక్షన్లు ఏప్రిల్ నెలలో ఆల్టైమ్ గరిష్టాన్ని తాకిన విషయం తెలిసిందే. రూ.1.67 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి .
‘ మే నెలతో జీఎస్జీ వసూళ్లు గత నెల అంటే కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్ వసూళ్లతో పోలిస్తే సాధారణంగానే తక్కువగా ఉంటాయి . అయితే మే నెలలో కూడా జీఎస్జీ వసూళ్లు 1.4 లక్షల కోట్ల మార్క్‌ను దాటడం చెప్పుకోదగ్గ అంశం ‘ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది . గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో గూడ్స్ దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం 43 శాతం మేర పెరిగింది . డొమెస్టిక్ ట్రాన్సాక్సన్ల ద్వారా లభించిన ఆదాయం ( సర్వీసుల దిగుమతులు సహా ) 44 శాతం మేర పైకి చేరింది .
మొత్తం రూ .1,40,885 కోట్ల జీఎస్టి వసూళ్లలో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ( సీజీఎస్ఓ ) వాటా రూ . 25,036 కోట్లుగా ఉంది . స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ( ఎస్ఓఎసీ ) వాటా రూ .32,001 కోట్లుగా నమోదు అయ్యింది . ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ( ఐజీఎస్ఓ ) వాటా రూ . 73,345 కోట్లుగా ఉంది . గూడ్స్ దిగుమతుల ఆదాయం రూ.37,469 కోట్లు ఇందులో భాగమే . సెస్ రూపంలో రూ . 10,502 కోట్లు లభించాయి . జీఎస్టీ వసూళ్లు రూ . 1.4 లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా మూడో నెల కావడం గమనార్హం . అలాగే మొత్తంగా చూస్తే నాలుగు సార్లు జీఎస్టీ కలెక్షన్లు ఈ మార్కును అధిగమించాయి.జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం ఇది వరుసగా 11 వ నెల అని చెప్పుకోవచ్చు .