– జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు
– డబుల్ ఇంజన్ సర్కార్ తో.. డబల్ బెనిఫిట్స్
– అక్టోబర్ 19 వరకు ప్రజలకు, వ్యాపారులకు అవగాహన
– జీఎస్టీ 2.0 తో రాష్ట్ర ప్రజలకు 8 వేల కోట్ల ఆదా
– మేడిన్ ఇండియా నినాదం మన లక్ష్యం కావాలి
– సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీలో మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం : జీఎస్టీ సంస్కరణలు ద్వారా పేద, మధ్యతరగతి వారితోపాటు అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటంతో పాటు ఆదాయం రెట్టింపు అవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బుధవారం రామచంద్రపురంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణలు దేశ చరిత్రలో నూతన అధ్యాయంగా మిగిలిపోతుంది అన్నారు. నాలుగు స్లాబులుగా ఉండే జిఎస్టిని కేంద్రం రెండు స్లాబులుగా సంస్కరించింది అన్నారు. నిత్యవసర వస్తువులు,మందులపై జీరో శాతం జిఎస్టి అమల్లోకి తెచ్చిందన్నారు. రైతులకు మేలు చేసే పరికరాలపై 8 నుంచి 5 శాతానికి తగ్గించారన్నారు.
సులభతరమైన జీఎస్టీ వ్యాపారులకు అమ్మకాల పెరుగుదల, వ్యవసాయ యంత్రాలపై ఉన్న 12 శాతం ఉన్న జీఎస్టీ ను 5 శాతానికి తగ్గించడం, ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ గిఫ్ట్ గా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ డబల్ బెనిఫిట్స్ కల్పించిందన్నారు. ఎం ఎస్ ఎం లపై ఉన్న 28 శాతాన్ని 12 శాతానికి తగ్గించి మేలు చేశారన్నారు. చిరు వ్యాపారులకు, వ్యవసాయ, విద్యా రంగాలకు మేలు జరిగేలా జిఎస్టి తగ్గించారన్నారు.
మనం తయారు చేసిన వస్తువులు మనమే కొనుక్కునే విధంగా ఉండాలని, దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. రాష్ట్ర ప్రజలకు 8 వేల కోట్లు మేర ప్రయోజనం చేకూరనుందని అన్నారు. రాష్ట్రంలో సుమారు 60 వేల సమావేశాలు నిర్వహించి, 1.60 కోట్ల కుటుంబాలను కలిసి జీఎస్టీ ప్రయోజనాలు వివరించేలా కార్యాచరణ ప్రభుత్వం రూపొందించింది అన్నారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, ఎస్ కే పి పి ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు మాస్టర్, నియోజకవర్గం మండలాల అధ్యక్షులు ఉండవిల్లి శివ, కొత్తపల్లి శ్రీనుబాబు, మేడిశెట్టి రవికుమార్, చావ్వకుల నారాయణ మూర్తి, కూటమి నాయకులు గరికపాటి సూర్య నారాయణ, సలాది రమేష్, చందమామ వాసు, కవల నానాజీ, కంచుమర్తి బాబురావు, దంగేటి గౌరీ శంకర్, నారాపురెడ్డి బలరాం, శంకర్,పలివెల ప్రకాష్, మహిళా నాయకులు జాస్తి విజయలక్ష్మి, వయిట్ల గజలక్ష్మి, విజయలక్ష్మి, పెద్ద ఎత్తున కూటమి పార్టీ నాయకులు, డీసీ లు, క్లస్టర్, బూత్ ఇన్చార్జిలు, వ్యాపారస్తులు, ప్రజలు పాల్గొన్నారు.