– నిద్రపోతున్న అధికారులు
– పెరుగుతున్న డయేరియా కేసులు
అమరావతి: గుంటూరు పట్టణం మురికి కూపంగా తయారవుతోంది. ఫలితంగా డయేరియా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ నగర కమిషనర్ పదే పదో చెప్పినా కింది స్థాయి అధికారులు నిద్రపోతున్నారు. రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. సైడ్ డ్రైన్స్ లేకపోవడంతో మురికి నీరు రోడ్ల మీద ప్రవహిస్తోంది. కాలువలు, గుంతలు దోమలకు నిలయాలుగా తయారయ్యాయి. డొంకరోడ్డు 5వ లైన్ కొన్నేళ్ళుగా రాకపోకలకు ఇబ్బందిగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని స్థానికులు అంటున్నారు.