( చాకిరేవు)
తన కొడుకు శరీరాకృతిపై విమర్శలతో, ‘పప్పు’ అంటూ వ్యక్తిత్వాన్ని దారుణంగా హననం చేస్తున్నా… ఏ రోజూ వైఎస్ రాజశేఖరరెడ్డి వలె “నరం చంపుకుని సహిస్తున్నాను” అంటూనే వెనకేసుకొని వచ్చి ఎదురుదాడి చేయలేదు. ఎమ్మెల్యేగా గెలవని వాడు అని ఎద్దేవా చేస్తున్నా… పార్టీలో ఎవరినీ లోకేశ్‌కు అండగా మాట్లాడమని అనలేదు.
ఎటువంటి చలనం లేకుండా, సమయం ఆసన్నమయ్యేవరకు, శిష్యునికి ఎదురైన పరీక్షలను తనే ఎదుర్కోవాలని స్థితప్రజ్ఞత చూపాడు అసలైన ఈ గురువు.
భయానక రాక్షస సంహారం కోసం శ్రీరాముడు విశ్వామిత్రుని వెంట వెళ్లినట్లు… భయంకర పాలనలో ప్రజల కోసం గురువు ఆశీస్సులు అందుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాడు. శత్రువులను కకావికలు చేసి, తన గురువు ఎన్నడూ చూడని అద్భుతమైన ప్రజాస్వామ్య విజయాన్ని గురు దక్షిణగా అందించాడు శిష్యుడు.
కన్న తల్లిని అవమానించిన వారిని ఆ సభలోకి అడుగుపెట్టడానికి వణికేలా… కన్న తల్లికి వందనం అర్పిస్తూ… గురువుకు సగర్వాన్ని అందించాడు.
గురుపూర్ణిమ శుభాకాంక్షలు!