విశాఖ: ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ చైర్మన్ విశాఖలో జీవి రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ చైర్మన్ గా తొలిసారి విశాఖ వచ్చిన జీవి రెడ్డి ఫైబర్ నెట్వర్క్ ఆపరేషన్స్ సెంటర్ ని పరిశీలించారు. ఆంధ్ర యూనివర్సిటీ లో ఉన్న ఏపీ ఫైబర్ నెట్ కార్యాల యాన్నిపరిశీలించి ఫైబర్ నెట్ ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు.
ఏపీ ఫైబర్ నెట్ లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఫైబర్ నెట్ లో బాక్సుల కొరత ఉందని త్వరలో ఆపరేటర్లకు పైబర్ నెట్ బాక్సులు అందిస్తామని హామీ ఇచ్చారు అలాగే ఏపీ ఫైబర్ నెట్ కు సంబంధించి ఆపరేటర్లు ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవద్దని త్వరలోనే ఏపీ ఫైబర్ నెట్ నెట్ వర్క్ ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.