విజయవాడ:వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత దుర్భర పరిస్థితుల్లో బాధలు పడుతున్న విజయవాడ వాసుల పరిస్థితిని, వారికి అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు వాహనాలు కూడా చేరుకోలేని ప్రాంతాల్లో 22 కిలోమీటర్లకు పైగా జెసిబి పై పర్యటిస్తూ అక్కడ ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించడంతో పాటు భరోసానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని బిజెపి జాతీయ నాయకులు జీవీఎల్ నరసింహరావు గారు తన X (ట్విట్టర్) ద్వారా అభినందించారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో మాట్లాడి సమన్వయం చేసుకొని ముఖ్యమంత్రి చేపట్టిన ఈ సహాయక చర్యల ద్వారా విజయవాడ వాసులు తమకు ఎదురైన ఈ విపత్తు నుండి త్వరగా కోలుకుంటారని జీవీఎల్ ఆశాభావం వ్యక్తం చేశారు.