* దేశ విదేశాల నుంచి పాల్గొన్న 15 స్టార్టప్ సంస్థలు
* ఫిర్యాదుల సత్వర పరిష్కారాని ఏఐ అధారిత యూస్ కసుల పరిశీలన
అమరావతి,: రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ఒక రోజు హ్యాకథాన్ పోటీలు జరిగాయి. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో గురువారం నిర్వహించిన ఈ పోటీలకు భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి మొత్తం 15 అంకుర (స్టార్టప్) సంస్థలు పాల్గొన్నాయి. పీజీఆర్ ఎస్ ద్వారా ప్రభుత్వం ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలు స్వీకరిస్తోంది.
వీటిని వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడానికి వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారితంగా ఉన్న వివిధ పరిష్కార మార్గాలను సాంకేతిక నిపుణులు ఈ పోటీల్లో ప్రదర్శించి చూపారు. ఫిర్యాదుల స్వీకరణ నుంచి, రియల్ టైమ్ ప్రోగ్రెస్ మానిటరింగ్, పరిష్కార ధృవీకరణ, ప్రజా స్పందన సేకరణ వరకు మొత్తం ప్రక్రియ ఆటోమేట్ చేసే వినూత్న ఆవిష్కరణలను పోటీలో పాల్గొన్న వివిధ స్టార్టప్ సంస్థలు ప్రదర్శించాయి. ఫిర్యాదుల్లో మళ్లీ మళ్లీ వస్తున్న అర్జీలు, సమస్యలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా పరిష్కరించాలి, ఫిర్యాదుల పరిష్కారంలో జరిగే జాప్యాన్ని తగ్గించి వేగవంతంగా సమస్యలు పరిష్కారమయ్యేలా ఉపయోగపడే వివిధ సాంకేతిక సదుపాయాలను నిపుణులు ప్రదర్శించి చూపారు.

