Suryaa.co.in

Telangana

రేపటి నుంచే ఒంటిపూట బడులు

హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు ఉంటాయని వెల్లడించింది. పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మార్చి 15 నుంచి ఒంటి బడి నిర్వహించనున్నారు.

అయితే కరోనా వల్ల ఈ ఏడాది ప్రత్యక్ష తరగతులు కొంత ఆలస్యంగా (సెప్టెంబరు 1వ తేదీ నుంచి) ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ సమయంలో కరోనా తీవ్రత మళ్లీ పెరగడంతో 24 రోజుల సెలవులు ఇచ్చారు. తరగతులు తక్కువగా నిర్వహించడంతో ఈ ఏడాది 70 శాతం సిలబస్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని రేపటి నుంచి రాష్ట్రంలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు మే 11వ తేదీన ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు మే 20వ తేదీన ముగియనున్నాయి. దీంతో ఈ ఏడాది అకాడమిక్‌ సంవత్సరం మే 20న ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22వ తేదీన ప్రారంభమై మే 12వ తేదీన ముగుస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE