-దేశ వినాశనం కోసం పుట్టిన పార్టీ బీజేపీ
-గాంధీ కుటుంబంలా త్యాగాలు చేశారా?
-పదేళ్లలో అప్పులను రెట్టింపు చేశారు
-దేవుడి పేరుతో రాజకీయం మానుకోండి
-15 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం
-తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
దేశ వినాశనం కోసం పుట్టిన పార్టీ బీజేపీ అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. గాంధీ భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ విలువలతో రాజకీయాలు చేస్తుందని, రాహుల్ గాంధీ కుటుంబం ఆస్తులను దేశం కోసం ధారపోశారని, ఉండడానికి ఇల్లు కూడా లేదన్నారు. బీజేపీ నేతలు దేశం కోసం ఎవరైనా ఆస్తులు త్యాగం చేశారా? అటువంటి నాయకుడు ఒక్కరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. నెహ్రూ, ఇందిరాగాంధీలు దేశ స్వాతంత్య్రం కోసం జైలు జీవి తం గడిపారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణ త్యాగాలు చేశారు. గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు, బీజేపీ నేతలు ఎవరైనా చేశారా.. చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దేశ ప్రధాని అయ్యే అర్హత కేవలం రాహుల్ గాంధీకి మాత్రమే ఉందన్నారు. 65 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 55 లక్షల కోట్లు ఉంటే..బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్‌లో అప్పులు డబుల్ అయ్యా యని, ప్రజలు ఆలోచించాలని కోరారు. బీజేపీ వినాశనం కోసం పుట్టింది. శ్రీరాముడు ఎప్పుడైనా అప్పుల పాలు కమ్మని చెప్పాడా..బీజేపీకి పది సీట్లు ఎందుకు… అప్పులు ఇంకా పెంచేందుకా..అని ప్రశ్నించారు.
హనుమంతుడు దేవుడు…లీడర్ కాదు
దేవుడిని మొక్కితే బీజేపీ వాళ్లే కనిపిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. గుళ్లలో బీజేపీ వాళ్లు దీపం కూడా పెట్టరు… దీపం పెట్టేది కాంగ్రెస్ కార్యకర్తలే.. మాకు ప్రచారం చేసుకోలేక వెనుకబడ్డాం. 15 స్థానాలు గెలుచుకోవడమే కాంగ్రెస్ నాయకులకు టార్గెట్ అని వివరించారు. రాహుల్‌గాంధీ పీఎం కావడానికి 15 స్థానాలు కీలకం కానున్నాయన్నారు. బంగారం వేసుకోవడం నాకు సోకు కాదు.. అది రాజముద్ర. బంగారం పవర్ ఇస్తుంది. మన్మోహన్ సింగ్ దిగిపోయే వరకు తులం బంగారం 28 వేలు ఉండే..మరో సారి మోదీ పీఎం అయితే లక్షకు చేరుతుందన్నారు. అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ బంగారం ధరలను నియంత్రిస్తారని వివరించారు. ఎనమిదేళ్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ఇప్పుడు తగ్గిస్తామనటం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్ర దేశ్‌లో రాళ్లతో కొట్టుకునే రాజకీయం చేస్తున్నారు. విభజన వల్ల ఆంధ్ర ప్రజలకు స్వయం పాలన వచ్చింది కదా.. ఎందుకు ఆ ఆలోచన చేయడం లేదు. హైదరాబాద్ రాకుండా మీ సీఎం గల్లీలో తిరుగుతున్నారు కదా. ఆంద్ర óప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. నార్త్ ఇండియాలో బీజేపీ దుకాణం బంద్ అయింది… అందుకే సౌత్‌కి వస్తున్నారని వ్యాఖ్యానించారు.