– సాయిధామం పీఠాధిపతి రామానంద అరెస్ట్
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం పెద్దపర్వతాపూర్ సాయిధామం పీఠాధిపతి రామానందను పోలీసులు అరెస్టు చేశారు. 2018లో ఆశ్రమంలోని ఓ బాలికపై రామానంద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. దాంతో సదరు బాలికను సీడబ్ల్యూసీ అధికారులు ప్రభుత్వ హాస్టల్‌కు తరలించారు.
అప్పటి వేధింపుల విషయమై ఆ బాలిక రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశాల మేరకు శనివారంనాడు రామానందపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు బొమ్మలరామారం ఎస్సై వెంకన్న తెలిపారు.